కంఠంరాజు కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు నిర్వహించిన చండీ హోమంలో తెనాలికి చెందిన శ్రీ హైమారావు, మేఘన దంపతులు రూ.12,116 చెల్లించి ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అదేవిధంగా శ్రీ కాసారనేని రత్నగిరి, లక్ష్మి కావ్య దంపతులు రూ.1,116 చెల్లించి పరోక్షంగా చండీ హోమంలో పాల్గొన్నారు. భక్తుల గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం
