87 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికలు పూర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియలో ఇప్పటివరకు 87 చోట్ల ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. పూర్తయిన ఎన్నికల్లో టీడీపీ 57, జనసేన 19, బీజేపీ 8, వైఎస్సార్‌సీపీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించినట్లు వెల్లడించారు.
మిగిలిన 13 పట్టణ స్థానిక సంస్థల్లో పలాస-కాశీబుగ్గ, ఎలమంచిలి, నర్సీపట్నం, మాచర్ల, నాయుడుపేట, పుత్తూరు, ధర్మవరం, జమ్మలమడుగు, రాజంపేట, ఎర్రగుంట్ల, ఆళ్లగడ్డ, గూడూరు, ఆత్మకూరు (నెల్లూరు) ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వాయిదా పడిన పరోక్ష ఎన్నికలను రేపు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.