Breaking News

ఇంజినీరింగ్ మరియు విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో రోడ్ల విస్తరణ జరుగుతున్న ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు షిఫ్టింగ్, నూతన లైన్ల ఏర్పాటుపై నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ మరియు విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్  అన్నారు. శుక్రవారం కమిషనర్  తమ చాంబర్ లో నగరంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నాడు-నేడు పనులు, తదితర అంశాల పై ఇంజినీరింగ్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు ప్రధాన రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరగుతున్నాయని, అందులో భాగంగా విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేయడానికి విద్యుత్ శాఖకు నగదు చెల్లింపు కూడా చేశామన్నారు. సదరు ప్రాంతాల్లో ఆ శాఖ నుండి చేపట్టాలిన పనులు త్వరితగతిన చేయాలన్నారు. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ మరియు విద్యుత్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. నగరంలో అవసరమైన ప్రాంతాల్లో నూతన లైన్లు ప్రతిపాదించామని, ఆయా ప్రాంతాల్లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి లైన్లు వేయాలని, అప్పుడే ఆయా ప్రాంతాల్లో వీధీ దీపాలు వేయడానికి వీలుపడుతుందన్నారు. అనంతరం జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణంపై హౌసింగ్ మరియు ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణం వేగంగా చేసుకునేలా అవగాహన కల్గించాలన్నారు. లే అవుట్స్ లో ఇళ్ళ నిర్మాణంకు కాంట్రాక్ట్ తీసుకున్న వారు నిర్దేశిత గడువులోగా పనులు చేయాలన్నారు. నగరంలో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలని, నవంబర్ నెలాఖరుకు పూర్తి అయ్యేలా ప్రణాళికాబద్దంగా పనులు జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నాడు-నేడులో భాగంగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగంగా జరగాలని, డి.ఈ.ఈ.లు మరింత భాద్యతగా పనుల వేగవంతం పై కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైన్ల నిర్మాణ సమయంలో ఎక్కడైనా రైల్వే లైన్లు, జాతీయ రహదారి క్రాసింగ్ ఉన్న చోట సంబందిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పనులు వేగవంతం చేయాలన్నారు. నగరంలో ప్రధాన మరియు అంతర్గత రహదార్ల వెంబడి, నగరపాలక సంస్థ స్థలాలల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని, జంక్షన్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తీ చేయాలని ఏ.డి.హెచ్.ని ఆదేశించారు. అభివృద్ధి పనులకు టెండర్ పొంది పనులు చేపట్టని కాంట్రాక్టర్ లను బ్లాక్ లిస్ట్ లో చేర్చడం, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ.ని ఆదేశించారు.
సమావేశంలో ఈ.ఈ.లు కొండారెడ్డి, శాంతి రాజు, సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, ఏ.డి.హెచ్. రామారావు, ఏపిసిపిడిసిఎల్ ఈ.ఈ. శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ డిఈఈలు శ్రీనివాసరెడ్డి, రమేష్ బాబు, శివకుమార్, హనీఫ్ అహ్మద్, కళ్యాణ రావు, మహ్మద్ రఫిక్, హౌసింగ్ డి.ఈ.ఈ.లు, ఏపిసిపిడిసిఎల్ డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *