విశాఖ 50వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బుచ్చి రామ్ ప్రసాద్

విశాఖపట్నం,నేటి పత్రిక ప్రజావార్త:
విశాఖపట్నం 50వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. బుచ్చి రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి భవాని విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ ఎన్నికల ఇన్‌చార్జ్ ఎం.డి. షరీఫ్ గతంలో అమరావతి పరిరక్షణలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశయాలు, సిద్ధాంతాల సాధనకు కూటమి నాయకులు కృషి చేయాలని అన్నారు. కూటమి అభ్యర్థి భవాని గెలుపు కోసం కార్యకర్తలు క్రమశిక్షణతో కలిసికట్టుగా పనిచేయాలని బుచ్చి రామ్ ప్రసాద్ కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రామ కోటయ్య, బీజేపీ నాయకులు ఎం.డి. షరీఫ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.