-19, 21వ వార్డుల్లో బూరుగుపల్లి శేషారావుతో కలిసి ప్రచారం
-ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు
తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త:
నిడదవోలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 19, 21వ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కలిసి స్థానిక ప్రజలను, నాయకులను, కార్యకర్తలను కలుసుకుంటూ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కూటమి అభ్యర్థుల తరఫున ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నికల ప్రచారాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నిడదవోలు పట్టణంలోని అన్ని వార్డుల్లో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.
