-సెంట్రల్ జైలు లోని ఖైదీలకు జె ఏ ఎస్ వైద్య శిబిరం
-ప్రత్యేక మహిళా కారాగారం లో జె ఏ ఎస్ వైద్య శిబిరం
– 156 మంది మహిళా ఖైదీలకు వైద్య సేవలు
-కేంద్ర కారాగారపు రిమాండ్ ముద్దాయిలు (1025) మందికి వైద్య సేవలు అందించాం
-కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్
– ప్రత్యేక మహిళా జైల్ సూపరింటెండెంట్ వసంత కుమారి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం కేంద్రకారాగారము, రాజమహేంద్రవరం నందు రెండవ రోజు “జగనన్న ఆరోగ్య సురక్షా” మెగా మెడికల్ క్యాంపును, ప్రత్యేక మహిళా కారాగారం నందు ఒకరోజు జె ఎ ఎస్ క్యాంపు ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. మాధవి లత వారి ఆదేశాల మేరకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి లు ఎస్. రాహుల్ , ప్రత్యేక మహిళా కారాగార పర్యవేక్షణాధికారిణి
వసంత కుమారి లు తెలిపారు. ఈ మెగా మెడికల్ క్యాంపు నందు రాజమహేంద్రవరం లో ఉన్న ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర వైద్యశాల ప్రత్యేక వైద్య బృందం, ఆశా వర్కర్స్, తదితరులు ఖైధీలకు వైద్య సేవలు అందించటం లో తమ వంతు కృషి చేసారన్నారు. ఈ మెడికల్ క్యాంపు నందు కారాగారపు రిమాండ్ ముద్దాయిలు (1025) మంది ‘జగనన్న ఆరోగ్య సురక్షా’ వైద్య సేవలు పొందియున్నట్లు కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ తెలిపారు. ప్రత్యేక మహిళా కారాగారంలో మహిళా కారాగారంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారికి, జిల్లా కలెక్టర్ మాధవీ లత, ప్రత్యేక కృతజఞతలు తెలిపారు. ఖైదీలకు వైద్య పరీక్షలు కోసం తీసుకుని వెళ్లి రావడం అనే ప్రక్రియ లేకుండా కారాగార గృహంలోనే శిబిరాన్ని నిర్వహించడం ద్వారా ఖైదీలకు ఆరోగ్య భరోసా కల్పించామన్నారు. సాధారణ వైద్య చికిత్స అవసరం అయిన వారికి పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రత్యేక వైద్య సేవలు అందించే అవసరం ఉన్న వారికీ రిఫర్ చేసినట్లు తెలిపారు. హుద్రోహ, జనరల్ మెడికల్, అర్థో పెడిక్, కార్డియాలజీ, అర్థో పెడిక్ , అప్త మలజి, డెంటల్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, డెంటల్, సైకాలజీ, ఈ ఎన్ టి, సైకాలజీ విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు , పారా మెడికల్ సిబ్బంది, టెక్నిషియన్స్, స్పెషలిస్ట్ డాక్టర్ల తో పాటు గైనిక్ డాక్టర్లు కూడా వైద్య సేవలు అందించడం కోసం ఈ శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు. వారందరికీ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నా మని వసంత కుమారి తెలిపారు. కారాగారా డిప్యూటీ సూపరింటెండెంట్లు మరియు జైలర్స్ మరియు కారాగారా వైద్యాధికారులు పి. కోమల, హరికా, రవి కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కే. వెంకటేశ్వరరావు, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా. ప్రియాంక , పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News