రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత వారి ఆద్వర్యంలో జుడీషియల్ ఆఫీసర్స్, రెవెన్యూ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ పోలీసు ఆఫీసర్స్, జువెనైల్ జస్టిస్ బోర్డు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు, ప్యానెల్ లాయర్సుకు నల్సా వారి చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ మరియు వారి రక్షణ స్కీమ్ 2015 సంబందించి సెన్సిటైజేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, బాలల హక్కులు మరియు వారికి సంబందించిన వివిద చట్టాల కోసం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల పట్ల అనేక అఘాయిత్యాలను జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు పిల్లలకు వివిధ చట్టాలపై, వారి హక్కుల పై అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యా హక్కు, బాల్య వివాహ నిషేధం, పోక్సో చట్టం, మొదలగు చట్టాల గురించి వివరించారు. పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారి పట్ల చట్టం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పిల్లలతో బిక్షాటన చేయించడం, వారి పై లైంగిక దాడులు చేయడం, వెట్టి చాకిరీ చేయించడం, బాల్య వివాహాలు మొదలగు సమస్యలను పూర్తి నిర్మూలించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు వారికి ఎటువంటి న్యాయ సమస్యలున్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ అనాధ పిల్లలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల బాధింపబడుతున్న పిల్లల సంక్షేమం వివిధ ప్రభుత్వ శాఖలపై ఉంటుందన్నారు. ఎలాంటి పిల్లలు కనిపించినప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో పర్మనెంట్ లోకదాలత్ ఛైర్మన్ ఎ. గాయత్రి దేవి పర్మనెంట్ లోకదాలత్ ద్వారా ప్రజలు వివిద ప్రభుత్వ ప్రయివేటు సంస్థలతో వారికున్న వివాదాలకు పరిష్కారం పొందవచ్చని తెలిపారు. పర్మనెంట్ లోకదాలత్ యొక్క విధివిదానాల పై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పి.డి. కె. విజయ కుమారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి పి. సూర్య ప్రభావతి, అబ్సెర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ కే. భాస్కరరావు, జె జె బి మెంబర్స్, చైల్డ్ వెల్ఫేర్ పోలీసు అధికారులు తదిరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News