అర్న‌బ్ తుపాన్ బాధితుల సాయం కొర‌కు మ‌నమిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అర్న‌బ్ తుపాన్ రాష్ట్రంవైపు దూసుకొస్తున్న నేప‌థ్యంలో తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు తుపాను కారణంగా ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురైనా మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా అధికారుల‌కు తెలియజేసే స‌దుపాయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పించింది. తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో తుపాన్ కార‌ణంగా ప‌లు స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి, వాటిని ఆ ప్రాంత ప్ర‌జ‌లు త‌మ మొబైల్ ఫోనులో మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా నేరుగా అధికారుల‌కు తెలియ‌జేసే స‌దుపాయం కల్పించిన‌ట్లు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారులు తెలిపారు. తుపాను స‌మ‌యంలో త‌మ ప్రాంతంలో చెట్లు కూలినా, విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయినా, నీళ్లు నిలిచిపోయినా, లేదా ఇత‌ర‌త్రా ఇంకెలాంటి స‌మ‌స్య‌లు ఎదురైనా వాటిని పౌరులు వెంట‌నే నేరుగా మ‌న‌మిత్ర ద్వారా ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురావ‌చ్చు. ఆ స‌మ‌స్య‌ల‌కు సంబంధించి ఫొటోల‌ను కూడా పౌరులు మ‌న‌మిత్ర ద్వారా ప్ర‌భుత్వ అధికారుల దృష్టికి తీసుకురావ‌చ్చు. పౌరులు మ‌న‌మిత్ర ద్వారా తెలియ‌జేసిన స‌మ‌స్య‌ను వెంట‌నే ఆ ప్రాంతంలో సంబంధిత అధికారుల‌కు చేర‌వేసి త‌క్ష‌ణ ఆ స‌మ‌స్య ప‌రిష్క‌రించేలా, తుపాన్ బాధితుల‌కు త‌క్ష‌ణ సాయం అందేలా చ‌ర్య‌లు తీసుకుంటారు. తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌లంద‌రూ ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని ఆర్టీజీఎస్ అధికారులు కోరారు.

ఎలా ఉప‌యోగించాలంటే…

మీ మొబైల్ ఫోన్ నుంచి 9552300009 మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ నెంబ‌రుకు హాయ్ అని మెసేజ్ చేయాలి

త‌దుప‌రి సేవ‌ల ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి

అర్న‌బ్ సైక్లోన్ ఇష్యూష్ అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి

రిపోర్ట్ ఇష్యూ ని ఎంపిక చేసుకుని క‌న్ఫ‌ర్మ్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి

రిజిస్ట్రేష‌న్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి

త‌రువాత మీ పేరు, జిల్లా, మండ‌లం న‌మోదు చేసి, మీ ప్రాంతంలో తుపాన్ కార‌ణంగా ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ను అందులో న‌మోదు చేయాలి.

ఫొటోలు కూడా అప్లోడు చేయొచ్చు

వెంటనే ఆ స‌మ‌స్య‌ను ఆ ప్రాంతంలో సంబంధిత అధికారికి పంపి వెంట‌నే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేలా చూస్తారు