విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ.యం.యస్.నెం.13 తేది:15.03.2024 ననుసరించి, గజ్జల వెంకట లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా నియమితులై శనివారం బాధ్యతలు స్వీకరించారు. గజ్జల వెంకట లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నందు మెంబర్ గా 03.08.2021 నుండి కొనసాగుతూ, తేది:15.03.2024 AN మెంబర్ గా పదవీ విరమణ చేసి, మహిళా కమిషన్ చట్టం-1998 సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ 9 ఆఫ్ 2023 ప్రకారము మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన మహిళా కమిషన్ చైర్-పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు, మహిళల భద్రతకు, మహిళాభ్యున్నతికి శాయశక్తులా పాటుపడతానని, ప్రభుత్వం మహిళల కోసం చేపడుతున్న కార్యక్రమాల అమలుకు అవిరళ కృషి సల్పుతానని తెలుపుతూ, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డా||ప్రభాకర్ రెడ్డి , సోషల్ యాక్టివిస్ట్ డా||కె.వసుంధర , ఇతర ప్రముఖులు, ఆప్తులు, మహిళా కమిషన్ సెక్రటరీ డి.శ్రీలక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …