-ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు
-సీఎం జగన్…. మాపై…. ప్రజలందరిపై అల్లా దైవం దీవెనలు ఉండాలి…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే కొడాలి నాని శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని, దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుక అయిన రంజాన్ పర్వదినాన్ని ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని, మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ఎమ్మెల్యే నాని అన్నారు.
Prajavartha Online Telugu News