Breaking News

ప్రతీ ముస్లిం.. దేవుడికి దగ్గరయ్యే మాసమే పవిత్ర రంజాన్ మాసం: ఎమ్మెల్యే కొడాలి నాని

-ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు
-సీఎం జగన్…. మాపై…. ప్రజలందరిపై అల్లా దైవం దీవెనలు ఉండాలి…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే కొడాలి నాని శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని, దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ముగింపు వేడుక అయిన రంజాన్ పర్వదినాన్ని ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని, మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని ఎమ్మెల్యే నాని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *