Breaking News

అక్టోబ‌ర్ 2న విజ‌న్ 2047 ప‌త్రం విడుద‌ల‌

-ప్ర‌తి జిల్లాలో 15 శాతం వృద్ధి సాధ‌నే ల‌క్ష్యం
-క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక వివ‌రించిన ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబ‌ర్ 2వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం విజ‌న్ 2047 విక‌సిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ డాక్యుమెంటును విడుద‌ల చేస్తుంద‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్వి పీయూష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ గురించి క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న వివ‌రించారు. ప్ర‌స్తుతానికి ఈ విజ‌న్ డాక్యుమెంటుకు విక‌సిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుకుంటున్నామ‌ని దీనికి ఇంకా మంచి పేరు ఎవ‌రైనా సూచించ‌వ‌చ్చ‌న్నారు. జీరో పావ‌ర్టీ, సోషియ‌ల్ అండ్ ఫిజిక‌ల్ ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్, డెమోగ్ర‌ఫిక్ మేనేజ్‌మెంట్‌, ఈజ్ ఆఫ్ లివింగ్ అనే నాలుగు అంశాలు ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఈ డాక్యుమెంటు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌తి జిల్లాలో 15 శాతం వృద్ది సాధించ‌డ‌మే ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంద‌న్నారు. ఈ నెల 6 నుంచి 8 వ‌తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శుల‌తో నీతి ఆయోగ్ అధికారులు భేటీ అవుతార‌ని, ఈ నెల 15వ తేదీలోపు ఈ విజ‌న్ డాక్యుమెంటుకు సంబంధించి ఆయా శాఖ‌ల అధికారుల నుంచి సూచ‌న‌లు స‌ల‌హాలు తీసుకుంటామ‌న్నారు. సెప్టెంబ‌రు 1 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకోవ‌డానికి ఈ డాక్యుమెంటును ప‌బ్లిక్ డొమైన్లో పెడ‌తామ‌ని చెప్పారు. మొత్తం 12 ర‌కాలు ప్రాధాన్య‌తా అంశాలతో ఈ డాక్యుమెంటును రూపొందించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. అక్టోబ‌రు 2వ తేదీ ఈ విజ‌న్ 2047 డాక్యుమెంటును ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విడుద‌ల చేస్తార‌ని వెల్ల‌డించారు.

Check Also

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *