Breaking News

ఈ నెల 19న శ్రీసిటీ నందు పలు పరిశ్రమలకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి…. ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

శ్రీసిటీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19 న శ్రీసిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం శ్రీసిటీ నందు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ సుబ్బరాయుడు, జెసి శుభం బన్సల్ తో కలిసి శ్రీసిటీ ప్రతినిధులతో మరియు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. శ్రీసిటీ ప్రతినిధులు వివరిస్తూ 8 పరిశ్రమలకు భూమి పూజ, 16 పరిశ్రమల ప్రారంభానికి, 5 పరిశ్రమలకు ఎంఓయు లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ అధికారులకు ఈ సందర్భంగా సూచిస్తూ హెలిప్యాడ్ ఏర్పాట్లు, అక్కడ షేడ్, భద్రత ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని సూచించారు. శ్రీ సిటీ సమీపం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన శ్రీసిటీ లోని బిజినెస్ సెంటర్ కు చేరుకుని భూమి పూజ, ప్రారంభోత్సవాలు పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఫాక్స్ కాన్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైతారని తెలిపారు. అనంతరం పలువురు పరిశ్రమల సిఈఓ లతో సమావేశంలో పాల్గొంటారని అన్నారు. కాన్ఫరెన్స్ హాల్ నందు, భూమి పూజ, పరిశ్రమలను ప్రారంభించనున్న ప్రాంతంలో మైక్ ఏర్పాట్లు, పవర్, అధునాతన అంబులెన్స్ ఏర్పాటు, భద్రత తదితర ఏర్పాట్లు ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ భద్రతా పరమైన అంశాలలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి లు, వెంకట్రావు, కులశేఖర్, ఆర్డీఓ కిరణ్ కుమార్, జోనల్ మేనేజర్ ఏపీఐఐసి చంద్ర శేఖర్, జిల్లా ఇంఛార్జి పరిశ్రమల శాఖ అధికారి, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, శ్రీసిటీ ప్రతినిధులు పీ. ముకుంద రెడ్డి రెసిడెంట్ డైరెక్టర్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

త్వరలోనే విశాఖపట్టణం, తిరుపతిలలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు

-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *