Breaking News

ఫ‌న్ టైమ్ క్ల‌బ్ లో అన్ని క్రీడా సదుపాయాలు వుండే విధంగా అభివృద్ధి చేస్తా : ఎంపి కేశినేని శివ‌నాథ్

-క్ల‌బ్ స‌భ్యుల‌తో ఆత్మీయ స‌మావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ బిజీ లైఫ్ లో సంప్ర‌దాయాలతో పాటు ఆర్యోగానికి ప్రాధాన్య‌త ఇస్తూ నిర్వ‌హిస్తున్న‌ ప‌న్ టైమ్ రిక్రియేష‌న్ సెంట‌ర్ లో అన్ని క్రీడా స‌దుపాయాలు వుండే విధంగా మ‌రింత‌గా అభివృద్ది చేస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఫ‌న్ టైమ్ క్ల‌బ్ లో క్ల‌బ్ స‌భ్యులు బుధ‌వారం ఏర్పాటు చేసిన ఆత్మీయ స‌మావేశానికి ముఖ్యఅతిధిగా ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి పాల్గొన్నారు. పన్ టైమ్ క్ల‌బ్ లోని జిమ్, ఇండోర్ స్టేడియంను సంద‌ర్శించారు. అనంత‌రం క్ల‌బ్ స‌భ్యులు ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహన్ ను ఘ‌నంగా స‌త్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ గ‌త న‌ల‌భై సంవ‌త్స‌రాలుగా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఈ క్ల‌బ్ ను నిర్వ‌హించ‌టం సామాన్య‌మైన విష‌యం కాద‌ని క్ల‌బ్ స‌భ్యుల‌ను అభినందించారు. రాజ‌ధాని ప్రాంతం విజ‌య‌వాడ‌లో క్రీడా స‌దుపాయాలు పెంచేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్ని విధాలు కృషి చేస్తున్నార‌ని తెలిపారు..గ‌త న‌ల‌భై సంవ‌త్స‌రాల ఫ‌న్ టైమ్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో ఎన్నో క్రీడ‌ల పోటీలు నిర్వ‌హించ‌టం జ‌రిగిందన్నారు. క్లబ్ స‌భ్యులు కోరిన విధంగా ష‌టిల్ కోర్ట్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు స‌హ‌క‌రిస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఫన్ టైమ్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), వైస్ ప్రెసిడెంట్ అట్లూరి సుమ బిందు, సెక్రెటరీ కిలారు వెంకట శివాజీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొసరాజు విజయబాబు, ట్రెజరర్ ముప్పవరపు సతీష్ బాబు, టిడిపి రాష్ట్ర నాయకులు బొప్పన భవ కుమార్, కార్పొరేటర్ దేవినేని అపర్ణ, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *