విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్యూమరేషన్ లో ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, కమర్షియరల్ లైసెన్స్ లేని కారణంగా గ్రౌండ్ ఫ్లోర్ లోని చిన్న చిన్న కిరాణా షాపులు, బడ్డీ కొట్టులు నమోదు కాలేదని వారికి కూడా నష్టపరిహారం అందే విధంగా చూడాలని ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సి.ఎం చంద్రబాబు వరద బాధితులకు నష్టపరిహారంగా అందించే ఆర్థిక సాయం విడుదల కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో వరద ముంపు ప్రాంతం లో ఎన్యూమరేషన్ సందర్బంగా నెలకొన్న సమస్యలు వుంటే చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిలు, ఎమ్మెల్యేలను కోరారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ లైసెన్స్ లేని కారణంగా ఎన్యూమరేషన్ లో నమోదు కాక ఇబ్బంది పడుతున్న బాధితుల ఇబ్బందులను తెలియజేశారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేసి వారి కూడా నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎం.పి.కేశినేని శివ నాథ్ అభ్యర్థనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించటమే కాకుండా ఎంపి కేశినేని శివనాథ్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కి ఆదేశాలిచ్చారు.
Prajavartha Online Telugu News