రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత జిల్లా కోర్ట్ ఆవరణలో “రోడ్డు ప్రమాదాల నివారణ” మరియు “హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత” ఫై ఆర్ట్స్ కాలేజ్ విద్యార్ధులుకి విజ్ఞాన మరియు అవగాహనా సదస్సు నిర్వహించారు. యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా, రాజమహేంద్రవరం వారి సహకారం తో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే విద్యార్ధులు కి హెల్మెట్లు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతీ ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం ప్రమాదకరం మరియు చట్టరిత్య నేరం అని తెలిపారు. అతి వేగం ప్రమాదకరమని, ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవ్వరు వాహనాలు నడపరాదని విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరించడం శిరస్సు పై బరువుగా భావించుకుండా అది మీ బాధ్యతగా భావించాలి అని తెలిపారు. విద్యార్ధులు బాగా చదువుకుని మంచి స్థాయికి చేరుకోవాలని, “హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్” అనే సూక్తి ని గుర్తించుకోవాలి అని చెప్పారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్ బాబు , ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రామచంద్ర రావు , పోలిటికల్ సైన్స్ హెడ్ ఒఫ్ డిపార్ట్మెంట్ పి.బాబ్లీ , యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఏ.విశ్వేశ్వర రావు, డిప్యూటీ రీజనల్ హెడ్ డి. రామ్మోహన్ రావు , సీనియర్ మేనేజర్లు ఏ. హుస్సేన్ , టి.నాగేశ్వర రావు , బ్యాంక్ సిబ్బంది మరియు ఆర్ట్స్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News