రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సంచాలకులు, పాఠశాల విద్య, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారి ఉత్తర్వుల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఉపాద్యాయ అర్హత పరీక్ష జూలై -2024 (A.P TET JULY 2024) పేపర్-1 మరియు పేపర్ -2 ది.03.10.2024 నుంచి ది.21.10.2024 వరకూ సెషన్ -1 ఉ.9.30నుంచి మ.12.00 మరియు సెషన్ -2 మ.2.30ని నుండి సా.5.00 గంటల వరకు రాజివ్ గాంధీ గ్రూప్ అప్ ఎడ్యుకేషన్ ఇన్ డిగ్రీ, లూధర్ గిరి, రాజమహేంద్రవరం, ION డిజిటల్ జోన్ IDZ లూధర్ గిరి నందు నిర్వహించ బడునని తెలియ చేసియున్నారు. అభ్యర్థులందరూ తమ హాల్ టికెట్ వెనుక ఇవ్వబడిన సూచనలను తప్పక అనుసరించి పరీక్షకు హాజరు అవ్వవలెనని సూమారు 8000 మంది అభ్యర్ధులు TET పరీక్షకు హాజరు అగునని తెలియచేసియున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష జులై -2024 నిర్వహణ నిమిత్తం డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ప్లైయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు నియమించడ మైనది. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ మరియు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా పాఠశాల విద్యాధికారి కె. వాసుదేవరావు బుధవారం తెలియజేసియున్నారు.
Tags rajamendri
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News