-ఇమ్మునైజేషన్ లక్ష్యం సాధించని ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెట్టాలి
-ఇంటింటి సందర్శన సమయంలో హై రిస్క్ గర్భిణీలను గుర్తించాలి
-హై రిస్క్ కేసుల విషయంలో ఏ ఎన్ ఎం – ఆషా వర్కర్లు గుర్తించిన వాటిని వైద్యులు వ్యక్తిగతంగా సందర్శించాలి
-డెలివరీ కి వారం ముందే సంబంధిత ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించాలి
-సమ్మె కారణంగా అత్యవసర కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
హై రిస్క్ గర్భిణుల గుర్తింపు, ఇమ్యూన్సైజేషన్ లక్ష్యాలను సాధించడంలో ఐ సి డి ఎస్, వైద్య ఆరోగ్య శాఖ మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, పి.హెచ్.సి., సి.హెచ్.సి., పరిధిలో ప్రతినెలా నిర్దేశించిన లక్ష్యాలను అనుసరించి ఎన్ని డెలివరీ కేసులకు సంబంధించిన ఎన్ని డెలివరీ కేసులకు హజరు అవుతున్నారని ప్రశ్నించారు. పి హెచ్ సి పరిథిలో డెలివరీ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా పి హెచ్ సి పరిథిలో ఐ సి డి ఎస్, వైద్య అధికారులు సంయుక్తంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ధవళేశ్వరం పీ హెచ్ సి పరిథిలో ఎక్కువ డెలివరీ కేసులు నమోదు అవ్వడంలో సంబంధిత మెడికల్ ఆఫీసర్ పని తీరు నిదర్శనం అన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా చొరవ చూపాలన్నారు .ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ డెలివరీ అయ్యే విధంగా నమ్మకం పెంచేలా అధికారులు చొరవ ముఖ్యం అన్నారు. ప్రవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ కేసులు నెలవారీ డేటా అనాలిసిస్ చేయాలన్నారు. సమ్మె కారణంగా అత్యవసర కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించ వద్దని, అటువంటి సందర్భాల్లో ప్రజల ప్రాణాలని కాపాడడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
క్షేత్ర స్థాయిలో ఇమ్యూనైజేషన్ అనుకున్న లక్ష్యాలను సాధించడంలో లోపాలను అధిగమించడం, డేటా ఎంట్రీ నమోదు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి తెలియ చేశారు.జిల్లాల , ప్రాంతాల వారీగా గుర్తించిన వ్యాధుల వివరాలు అందచేయాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని ఆమేరకు నివేదిక అందచేయాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. హై రిస్క్ ప్రగ్నెన్సీ విషయంలో బర్త్ ప్లాన్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండ ప్రవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి కారణం తెలుసుకోవాలని , వాటికీ సంబంధించి మళ్లింపు కు కారణాలతో ఐ సి డి ఎస్ , వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదికలు అందచెయ్యలన్నారు. కంటి వెలుగు సంబంధించి సిఫార్సు చేసిన వాటి యదార్థ స్థితి పై నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. 108, 104 వాహనం సంబంధించి వస్తున్న ఫోన్ కాల్స్, పట్టే సమయం, ఏ ఏ కేసులకు సంబంధించి సేవలు అందించడం జరిగిందన్న వాటిపై నివేదిక అందచేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ ఎన్ పి పద్మశ్రీ, , డిప్యూటి డీఎంహెచ్వో డా ఎన్ వసుంధర, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా ఎమ్. లక్ష్మీ సూర్యప్రభ, ఐ సి డి ఎస్ పిడి కె విజయ కుమారి, జిల్లా వాస్ట్స్ ఆరోగ్య సేవా కో ఆర్డినేటర్ డా పి ప్రియాంక, ఇతర వైద్య ఆరోగ్య శాఖ, ఐ సి డి ఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News