Breaking News

క్యాన్సర్ బాధిత చిన్నారికి వై ఎన్ ఆర్ చారిటీస్ ఆపన్న హస్తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. మధురానగర్ లో నివాసముంటున్న చిన్నారి కీర్తన గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. నిరుపేద కుటుంబం అయిన తమకి సాయం అందించాలని వై ఎన్ ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ ను చిన్నారి కుటుంబ సభ్యులు సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించారు. బుధవారం పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) చేతుల మీదగా తాడిగడపలోని తమ కార్యాలయంలో రూ 50 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు,యలమంచిలి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *