Breaking News

ప్రణాళిక బద్ధంగా దసరా ఉత్సవాల ఏర్పాట్లు

-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 3నుంచి 12వరకు జరిగే అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈఓ కె ఎస్ రామారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర,శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్ రావు , పోలీసు ఉన్నతాధికారులు అగ్నిమాపక సిబ్బంది సంబంధిత అధికారుల తో బుదవారం తాడిగడప లోని తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అమ్మవారి దర్శనం చేసుకొనేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలీస్‌ బందోబస్తు తగినంత ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యాత్రికులకు మంచినీరు సరఫరా చేయాలని, పారిశుధ్యం నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన అన్ని మందులు అందుబాటులో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రసాదం తయారీలో పరిశుభ్రత విధిగా పాటించాలన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అన్ని శాఖల సమన్వయంతో దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సుజనా అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *