Breaking News

ట్రాఫికింగ్, వ్యాపార లైంగిక దోపిడీ బాధితుల సమస్యలు మరియు సవాళ్లపై రాష్ట్ర స్థాయి సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెల్ప్ మరియు విముక్తి సంయుక్తంగా శనివారం స్థానిక హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో వివిధ రాజకీయ పార్టీల మహిళా విభాగ నాయకులు మరియు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులతో ట్రాఫికింగ్ మరియు వ్యాపార లైంగిక దోపిడీ బాధితుల (సెక్స్ వర్కర్స్) సమస్యలు మరియు సవాళ్లపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాయి.
ఈ సమావేశంలో పీ.ఓ.డబ్ల్యూ, ఐద్వా, ఎన్‌.ఎఫ్‌.ఐ.డబ్ల్యూ, ఆంద్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య, దళిత స్త్రీ శక్తి, జనసేన మహిళా విభాగాలు, భూమిక ఉమెన్ కలెక్టివ్, వివిధ రాజకీయ పార్టీల మహిళా విభాగం నాయకులు, ప్రజా సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి 60 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
వివిధ రాజకీయ పార్టీల మహిళా విభాగాల ప్రతినిధులు కలిసి కట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా విముక్తి రాష్ట్ర స్థాయి మానవ అక్రమ రవాణా,వ్యాపార లైంగిక దోపిడీ భాదితుల సంఘం వారి సమస్యలు,సవాళ్లను పరిష్కరించడంతోపాటు వారికి కమ్యూనిటీ ఆధారిత పునరావాసం, బాధితుల నష్ట పరిహారం మరియు ఇతర ప్రభుత్వ సహాయక సేవల కోసం సంఘీభావాన్ని తెలుపుతూ సామూహిక మద్దతు అందించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ప్రధానంగా మానవ అక్రమ రవాణా మరియు వ్యాపార లైంగిక దోపిడీ బాధితుల (సెక్స్ వర్కర్స్) రక్షణ, పునరావాసం మరియు వారికి నష్ట పరిహారం అందించాల్సిన అంశాలపై తగిన చర్యలు చేపట్టడంలేదని రాజకీయ పార్టీల మహిళా సంఘాల నేతలు తమ ఆందోళనను వెలిబుచ్చారు.
ప్రభుత్వ వ్యవస్థలన్నింటిలోనూ ట్రాఫికింగ్ నుండి రక్షించబడిన మరియు వ్యాపార లైంగిక దోపిడీ (సెక్స్ వర్కర్ల) బాధితులపై ప్రబలంగా ఉన్న వివక్ష మరియు చిన్న చూపు తీవ్రమైన ఆందోళన కలిగిస్తుందని పార్టీల ప్రతినిధులు ముక్త కంఠంతో నొక్కిచెప్పారు. భాదిత మహిళల పై వివక్ష చూపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకురాలు దేవకి, పి.ఓ.డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి P. పద్మ. ఐద్వా కార్యదర్శి శ్రీదేవి, ఎ.పి. మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి P. దుర్గా భవాని, దళిత స్త్రీ శక్తి నాయకురాలు M. హేమలత, మార్పు సంస్థ డైరెక్టర్ శ్రీమతి R.. సూయజ్, న్యాయవాది రాధా కుమారి, భూమిక ఉమెన్ కలెక్టివ్ నుండి D. బిందు, చైతన్య మహిళా సంఘం నుండి మంజరి మరియు విముక్తి అధ్యక్షురాలు అపూర్వ మరియు సభ్యులు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *