-ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కానికి ప్రభుత్వం చొరవ చూపాలి..
-కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించి, 12వ పి.ఆర్. సి కమిషనర్ ని నియమించాలి.
-ఏపిజేఏసి అమరావతి రాష్ట్రనాయకులు బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే ఐఆర్ ప్రకటించాలని, అలాగే గత ప్రభుత్వం నియమించిన 12వ పిఆర్సి కమిషనర్ రాజీనామా చేసినందున, నిర్ణీత కాల పరిమితితో పి.ఆర్.సి. నివేదిక సమర్పించేందుకు వీలుగా వెంటనే 12వ పిఆర్సి కమిషనర్ ని నియమించాలని కోరారు.
గత ప్రభుత్వ హయంలో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారని, ప్రధానంగా 11వ రివర్సు పిఆర్సి ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని, ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గమంతా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారని, ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ ఆర్దిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ జెఎసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర రావు, స్టేట్ అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, రాష్ట్ర కోశాధికారి కనపర్తి సంగీతరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్ లో జరిగిన ఏపీ జెఎసి అమరావతి స్టేట్ సెక్రటేరియట్ సమావేశం స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ…. నేడు రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినందున, ఈ కూటమి ప్రభుత్వం పై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడిచి, దసరా/ దీపావళి లాంటి పెద్ద పండగలు కూడా దాటిపోయినందున, ప్రభుత్వం నుండి ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గౌ || ముఖ్యమంత్రి గారు
స్పందన ఎప్పుడు ఉంటుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.
అయితే, ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు/పెన్షన్లు 1 వ తేదీన చెల్లిస్తూ, ఉద్యోగుల మనోభావాలు, ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నందుకు ముందుగా ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్న ఉద్యోగుల మనోభావాలను గౌ || ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాల్సిన భాధ్యత నాయకులుగా మా మీద ఉన్నందున, ఇటీవల గౌ|| ముఖ్యమంత్రి గారి కార్యాలయ ముఖ్య కార్యదర్శి శ్రీ ముద్దాడ రవిచంద్ర ఐఏఎస్ గారినీ కలిసి, ప్రధానమైన షుమారు 18 అంశాలను వారికి సవివరంగా వివరించి, ప్రతి అంశముపై లిఖిత పూర్వకంగా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన లేఖలు కూడా అందజేయడం జరిగింది.
అందులో ప్రధానంగా…..గత దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి, పద్ధతికి గత ప్రభుత్వం గండి కొట్టి, కనీసం ఎన్నికల ముందైనా ఐఆర్ ప్రకటించకుండా సాధారణ ఎన్నికలకు వెళ్ళినందున, ఇప్పటికే 15 మాసాల కాలాన్ని ఉద్యోగులు కోల్పోయినందున మరియు
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామి మేరకు తక్షణమే
మధ్యంతర భృతి (ఐ ఆర్) ప్రకటించి, 12వ పిఆర్సి కమీషనర్ ను వెంటనే నియమించాలని కోరారు.
పెన్షనర్ల సమస్యలు
2014-19 లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో సంపాదించుకున్న అడిషనల్ కౌంటమ్ ఆఫ్ పెన్షన్ ను గత ప్రభుత్వం కోత వేసి 11వ రివర్స్ పీ ఆర్ సి లో తగ్గించినందున, ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబులను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న షుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలా చూసి వృద్ధులను ఆదుకోవాలని కోరారు..
ఉద్యోగుల హెల్త్ కార్డులు (ఇ హెచ్ యస్ కార్డు)
గత పది సంవ్సరాలుగా పూర్తి జబ్బుతో పని చేయకుండా పోయిన ఉద్యోగుల,పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేశాలా తగు చర్యలు తీసుకోవాలని, ఇ హెచ్ యస్ స్కీమ్ కోసం ప్రతినెలా మా జీతాల్లో /పెన్సన్లో డబ్బులు రికవరీ చేసుకోని కూడా ఎవరికీ ఉపయోగకరంగా ఈహెల్తు స్కీమ్ లేనందున, తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యమైన “క్యాస్ లెస్ ట్రీట్ మెంటు” ప్రతి ఉద్యోగి/పెన్షనర్ కు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.
మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినులు తో సమానంగా చైల్డ్ కేర్ లీవ్
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 6 నెలల చైల్డ్ కేర్ లీవ్ కేద్రప్రభుత్వ ఉద్యోగినులుతో సమానంగా 2 సంవత్సరాలకు పెంచాలి.
కాంట్రాక్ట్ ఉద్యోగుల & ఔట్ సోర్శింగు ఉద్యోగులు సమస్యలు
గత ప్రభుత్వం హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి, కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు మరి కొన్ని శాఖలలో వారిని 2023 – ఆక్ట్ 30 ప్రకారం క్రమబద్ధీకరణ చేశారని, విద్యా మరియు ఇతర శాఖల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులను నేటికీ కనుబద్ధీకరించ లేదని, కనుక మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు.
అలాగే రాష్ట్రంలో రెగ్యూలర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు లక్ష మంది ఔట్ సోర్శింగు ఉద్యోగులు ఆప్కాస్ కార్పురేషన్ ద్వారా జీతాలు పొందు తున్నారు. ఇంకా ఆప్కాస్ లో లేకుండా సుమారు లక్షమంది ఉద్యోగులు కాంట్రాక్టుల ద్వారా జీతాలు పొందుతూ మోసమోతున్నారు. కావున వీరందరికీ ఉద్యోగబధ్రత కల్పించేలా చర్యలు తీసుకొని రెగ్యూలర్ ఉద్యోగులతో పాటు సమనంగా పనిచేస్తున్న ఔట్ సోర్శింగు ఉద్యోగులందరికీ సమానపనికి సమానవేతనం ఇచ్చేలా చర్యలు తీసుకొవాలని, అలాగే ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పధకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆధుకోవాలని విజ్ఞప్తి చేసారు.
ఉద్యోగులు/పెన్షనర్లుకు చెల్లించాల్సిన బకాయిలు
అంతే కాకుండా ఉద్యోగులకు 11 వ పిఆర్శీ బకాయిలతో పాటు, 2018 జులై నుంచి డిఏ అరియర్సు ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రావడంలేదు.
అలాగే ఉద్యోగులు అవసరాల కోసం దాచున్న జీపీఎఫ్ డబ్బులు కూడా గత ప్రభుత్వం వాడుకుని ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అదేవిధంగా 2022 నుండి ఉద్యోగులకు బకాయిలు ఉన్న ఎన్ క్యాష్మెంట్ ఆఫ్ ఎరండ్ లీవ్, APGLI మరియు సరెండర్ లీవులు, ముఖ్యంగా 24గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్లో ఉన్న సరండర్ లీవులు మంజూరు చేయాలని కోరారు.
కూటమి ప్రభుత్వం పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల సమస్యలపై గౌః ముఖ్యమంత్రిగారు చొరవ తీసుకొని న్యాయం చేయాలని ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున విజ్ఞప్తి చేస్తున్నామని బొప్పరాజు, దామోదరరావు, ఫణిపేర్రాజు,కనపర్తి సంగీతరావు లు విజ్ఞప్తి చేసారు.
ఈ సమావేశంలో ఏపిజేఏసి అమరావతి స్టేట్ కమిటిలో ఉన్న 21 కార్యవర్గ సభ్యులు అసోసియేట్ చైర్మన్ టి.వి ఫణి పేర్రాజు కొఆపరేటివ్ ) ట్రెజరర్ కనపర్తి సంగీత రావు( పంచాయితీ రాజ్ ఇంజినీర్స్), కో చైర్మన్ లు పి.వి.రమణ (హెడ్ మాస్టర్స్), జనకుల శ్రీనివాసరావు (పోలీస్ అధికారులు) పి.ఎస్.ఎస్.ఎన్.శాస్త్రి (రిటైర్డ్ ఎంప్లాయీస్ ) జి.శివానంద రెడ్డి స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ ) సంసాని శ్రీనివాసరావు (ఏపి డ్రైవర్స్ అసోసియేషన్) ఎస్ మల్లేశ్వర రావు ( ఏపి క్లాస్ IV అసోసియేషన్) మరియు వివిధ డిపార్టు మెంట్లకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు విశ్రాంత ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్ష/ప్రధాన కార్యదర్శులు మరియు ఏపిరెవిన్యూ సర్విసెస్ అసోషియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్ తో పాటు ఏపిజేఏసి అమరావతి స్టేట్ ఉమెన్ కమిటీ చైర్ పర్సన్ పారె లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి తోపాటు కాంట్రాక్టు & ఔట్ సోర్సింగు రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కె.సుమన్,అల్లం సురేష్,క్యాపటల్ సిటీ అధ్యక్ష,కార్యదర్శులు దుర్గారావు,శంకరరావు హాజరయ్యారు.