ఉత్తరాంధ్రలో ‘రేర్ ఎర్త్ హబ్’ ఏర్పాటుపై కీలక అడుగు

-CII భాగస్వామ్య సదస్సులో మంత్రులు కొల్లు రవీంద్ర, టి.జి.భరత్ ను కలిసిన రష్యా బృందం
-ఏపీలో క్రిటికల్ మినరల్స్ వెలికితీత, ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్న బీచ్ సాండ్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని రష్యాకు చెందిన Giredmet సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 31వ సిఐఐ సదస్సులో మంత్రులు కొల్లు రవీంద్ర, టి.జి.భరత్ తో ఏపీ ప్రభుత్వ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా IAS ఆధ్వర్యంలో Giredmet సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఇటీవల మాస్కో పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యాకు చెందిన ప్రతిష్టాత్మక ‘గిరెడ్మెట్’ (Giredmet) సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఉన్న అపారమైన ఖనిజ వనరులను ఉపయోగించుకుని, ఉత్తరాంధ్రలో డీప్ ప్రాసెసింగ్ మరియు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిఫైనింగ్ హబ్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు ఈ రోజు సదస్సుకు హాజరయ్యమని, త్వరలోనే ప్రభుత్వ సహకారంతో ఏపీలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అరుదైన ఖనిజాల వెలికితీత, వేరు చేయడం, శుద్ధి చేయడం మరియు అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ తయారీలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందమని సమస్త ప్రతినిధులు తెలిపారు.

ప్రధానంగా మోనోజైట్ పరీక్షలు, వేరు చేయడం మరియు శుద్ధి ప్రక్రియలలో సాంకేతిక భాగస్వామ్యం, ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ రిఫైనింగ్/డీప్-ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల పరిశీలన, ఏపీలో రేర్వి ఎర్త్ రంగంలో పరిశోధనా సంస్థలతో కలిసి ఉమ్మడి పరిశోధన, శిక్షణ మరియు సాంకేతిక బదిలీ ఏర్పాటు అంశాలపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు నెల్లూరు తీర ప్రాంతాల్లో మోనాజైట్ (Monazite), బీచ్-శాండ్ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో పోర్టులు, పారిశ్రామిక కారిడార్, ఖనిజ వనరులు అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, విధానపరమైన మద్దతు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వివరించారు. ముందుగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫెసిలిటీ, చివరగా అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు.

కార్యక్రమంలో రష్యన్ ఫెడరేషన్ పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ‘ట్రేడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రష్యా ఇన్ ఇండియా’ జీఆర్ (GR) మరియు ఫైనాన్స్ సెక్టార్ హెడ్ జ్లాటా అంటుషెవా (Ms Zlata Antusheva) ఈ బృందానికి నాయకత్వం వహించారు. ఈ బృందంలో రష్యాకు చెందిన ప్రముఖ సంస్థలైన గిరెడ్మెట్ ఇన్‌స్టిట్యూట్ (Giredmet Institute), రోసాటమ్ (Rosatom), స్బెర్‌బ్యాంక్ (Sberbank), మరియు ట్రాన్స్‌మాష్‌హోల్డింగ్ (Transmashholding) ప్రతినిధులు పాల్గొన్నారు.