వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తితో డాక్టర్ తరుణ్ కాకాని భేటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ తరుణ్ కాకాని, ఎన్టీఆర్ జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి చిరంజీవి ఎన్. ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినియోగదారుల కమిషన్‌లో దాఖలవుతున్న వివిధ రకాల కేసులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి అనుసరిస్తున్న న్యాయపరమైన విధానాలపై ఇరువురూ చర్చించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో కమిషన్ పాత్ర, న్యాయపరమైన అవగాహన తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.