– ఆర్నాబ్, మురసు తుఫానులతో 4,61,194 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం
– 29,960 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం..
– వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ఆర్నాబ్, మురసు తుఫానుల కారణంగా వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఉదయం ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో 15 జిల్లాల్లో 10,90,933 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి గాను 3,27,843 హెక్టార్లలో (30.05%) పంటనష్టం నమోదైందని, 5,23,136 మంది రైతులు ప్రభావితమయ్యారని అధికారులు వివరించారు. 9,78,091 టన్నుల ఉత్పత్తి నష్టంతో రూ.2,392.84 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేసినట్లు తెలిపారు. కోనసీమ జిల్లాలో 99.19 శాతం సాగు విస్తీర్ణం దెబ్బతినగా, 94,808 మంది రైతులకు సంబంధించి రూ.348.88 కోట్ల ఆర్థిక నష్టం నమోదైందన్నారు, SDRF కింద రూ.815.57 కోట్లు, NDRF కింద రూ.714.96 కోట్లను అంచనా వేసినట్లు తెలిపారు. మురసు తుఫాను ప్రభావంతో 9 జిల్లాల్లో 5,62,445 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి గాను 1,33,351 హెక్టార్లలో (23.71%) పంటలు దెబ్బతిన్నాయని, 1,86,269 మంది రైతులు ప్రభావితమయ్యారని అధికారులు వివరించారు. 3,38,302 టన్నుల ఉత్పత్తి నష్టంతో రూ.816.53 కోట్ల ఆర్థిక నష్టం నమోదైందని అంచనా వేసినట్లు తెలిపారు. SDRF కింద రూ.321.64 కోట్లు, NDRF కింద రూ.266.67 కోట్లను అంచనా వేసినట్లు తెలిపారు.
ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో 15 జిల్లాల్లోని 215 మండలాలు, 1,310 గ్రామాల్లో 23,211.48 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతినగా, 58,990 మంది రైతులు ప్రభావితమయ్యారని అధికారులు వివరించారు. ఇప్పటివరకు 58,630 మంది రైతులకు సంబంధించిన 23,035.08 హెక్టార్లలో (99.24%) ఎన్యూమరేషన్ పూర్తయిందని, రాష్ట్రస్థాయి నివేదిక ప్రకారం మరో 176.40 హెక్టార్లలో 360 మంది రైతుల నమోదు పెండింగ్లో ఉందని తెలిపారు. మొత్తం 15 జిల్లాల్లో 14 జిల్లాలు నూరు శాతం ఎన్యూమరేషన్ పూర్తిచేయగా, కృష్ణా జిల్లాలో 86.67 శాతం పూర్తయిందన్నారు. మురసు తుఫాను ప్రభావంతో 8 జిల్లాల్లోని 106 మండలాలు, 530 గ్రామాల్లో 6,748.52 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతినగా, 12,586 మంది రైతులు ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 3,392 మంది రైతులకు సంబంధించిన 2,211.73 హెక్టార్లలో (32.77%) మాత్రమే ఎన్యూమరేషన్ పూర్తయిందని, ఇంకా 4,536.79 హెక్టార్లలో 9,194 మంది రైతుల నమోదు పెండింగ్లో ఉందని వివరించారు. రెండు తుఫానుల వల్ల జరిగిన నష్టాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, ఇంకా నమోదు చేయాల్సిన పంటల విస్తీర్ణం, రైతుల సంఖ్యను జిల్లాలవారీగా గుర్తించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎన్యూమరేషన్ను త్వరితగతిన పూర్తిచేసి, అర్హులైన ఒక్క రైతు కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
