-650 మందికి పైగా తెలుగు కుటుంబ సభ్యుల హాజరు – తెలుగు సంఘాల ఐక్యతకు వేదికగా నిలిచిన వేడుకలు
ఖతార్, నేటి పత్రిక ప్రజావార్త:
తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు ప్రవాస తెలుగు ప్రజల ఐక్యతను చాటిచెబుతూ, నవంబర్ 6న ఖతార్‌లో తెలుగు డయాస్పోరా ఫెడరేషన్ (TDF) ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ వేడుకలకు 650 మందికి పైగా తెలుగు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. AKV, TKS, TPS, TJQ, APWA, TGS, TSA తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొని సంఘీభావాన్ని చాటారు.
TDF ఖతార్ అధ్యక్షులు యలమంచిలి శాంతయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ ఫస్ట్ సెక్రటరీ హరీష్ పాండే, ప్రముఖ అతిథి గొట్టిపాటి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
గాయకులు మానస ఆచార్య, హరీ గుంట సంగీత ప్రదర్శనలు, యాంకర్ స్వప్న చౌదరి వ్యాఖ్యానం, ఆంజనేయులు, కళ్యాణ్ చక్రవర్తి పౌరాణిక పాత్రల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు, మహిళల సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకల్లో సందడి నింపాయి.
తెలుగు సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో TDF బృందం చేసిన సమష్టి కృషి, అద్భుతమైన నిర్వహణ అందరి ప్రశంసలు అందుకుంది.
తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు అందించడం, ప్రవాస తెలుగు ప్రజల ఐక్యతను బలోపేతం చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం తమ ప్రధాన లక్ష్యాలని నిర్వాహకులు తెలిపారు.
తెలుగు సంఘాలు వేరైనా మన భాష ఒక్కటే, మన సంస్కృతి ఒక్కటే, మనమంతా తెలుగు వారమే అనే సందేశంతో ఈ వేడుకలు ఖతార్‌లో తెలుగు ప్రజల ఐక్యతకు చిరస్మరణీయంగా నిలిచాయి.
