నూతన జెడ్పీ ఛైర్మన్ కోట పుల్లమ్మకు నెట్టెం రఘురామ్ అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా పరిషత్ నూతన ఛైర్మన్‌గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన కోట పుల్లమ్మ మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురామ్‌ను కేడీసీసీ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పదవీకాలంలో ప్రజలకు విశేష సేవలందించాలని ఆకాంక్షించారు. జనరల్ స్థానంలో దళిత మహిళకు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కల్పించడం కూటమి ప్రభుత్వ సామాజిక న్యాయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమాన అవకాశాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. కష్టపడిన పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ సముచిత గుర్తింపు ఇస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, గంపలగూడెం ఎంపీపీ బూరుగు అంజలి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రేగళ్ల వీరారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బూరుగు నారాయణ, ఇటువంటి మధుసూదన్ రావు, ఎంపీటీసీ కోట వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాజా రవికుమార్, కంచర్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.