పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు మేయర్ రెడ్డి అప్పలనాయుడు

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఏలూరు మేయర్‌గా ఎన్నికైన రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో అప్పలనాయుడు తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.