ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటు కీలకం…

-విటీపీఎస్ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ
-విజయవాడ: విటీపీఎస్ కాలనీలోని పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సందర్శించి పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
-ఇప్పటివరకు ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఓటింగ్ శాతం ఎంత నమోదైందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును సమీక్షించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు బలమైన పునాది అని, ప్రతి ఓటు ఎంతో విలువైనదని ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, పటిష్టతలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.