పశ్చిమలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన టీడీపీ నాయకులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్, టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి కూటమి అభ్యర్థులతో మాట్లాడారు. అప్పటివరకు నమోదైన పోలింగ్ శాతం, కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.