ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి విజయం తథ్యం: గొట్టిపాటి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం తథ్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో ఏర్పాటుచేసిన కూటమి నాయకుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కూటమి ముఖ్య నేతలతో భేటీ అయిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్థానిక నాయకులతో చర్చించారు. నాయకులు ప్రణాళిక బద్ధంగా పని చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం జెండా ఎగరవేయవచ్చని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అబ్జర్వర్లు, పార్టీ క్యాడర్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. సుమారు 1000 కోట్లు ఖర్చుపెట్టి గుంతల రోడ్లకు మరమ్మత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పారు. వైసిపి నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *