Breaking News

నులిపురుగుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పిల్లల్లోని నులిపురుగుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో వైద్య, విద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనత (అనీమియా), పోషకాహార లోపాన్ని అధికమించి ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఆ రోజున ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలు, కిశోర బాలలకు ఆల్బెండజోల్ మాత్రలు అంగన్వాడి, పాఠశాలలు, కళాశాలలో ఉచితంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ వయసు వారికి ఎంత డోసు మాత్రలు ఇవ్వాలనేది ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన కల్పించి మాత్రలు సక్రమంగా పంపిణీ చేసేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆయన నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం అవగాహన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్ శర్మిష్ట, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్, డీఈవో పీవీజే రామారావు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *