విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC) ఆధ్వర్యంలో విజయవాడలో అక్టోబర్ 27, 28 తేదీలలో నిర్వహించాల్సిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (FMG) విద్యార్థుల ఇంటర్న్‌షిప్ కేటాయింపు కౌన్సెలింగ్‌ను (Internship Allotment Counselling) తుపాను ప్రభావం దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ గార్లపాటి నంద కిషోర్ తెలిపారు.
తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు ప్రయాణించాల్సిన ఎఫ్ఎంజీ విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులను, ప్రయాణ సమయంలో వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇంటర్న్‌షిప్ కేటాయింపు కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు వెల్లడించారు.
వాయిదా పడిన ఇంటర్న్‌షిప్ కేటాయింపు కౌన్సెలింగ్‌కు సంబంధించిన తదుపరి తేదీలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి, కొత్త తేదీలకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలని సూచించారు.
