విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదివారం దర్శించుకున్నారు. తనయుడు జగదీష్ సాయితో కలిసి మంత్రి సవిత దుర్గమ్మ అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రి సవితకు ఆశీర్వచనాలు, అందజేశారు. దేవస్థాన అధికారులు మంత్రికి అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమాల తరవాత క్యూ లైన్లో భక్తులతో మంత్రి సవిత మాట్లాడుతూ సౌకర్యాల కల్పనపై ఆరా తీశారు.. దేవస్థానంలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని భక్తులు తెలిపడంతో మంత్రి ఆనందం వ్యక్తంచేశారు. అంతకు ముందు దేవస్థానానికి వచ్చిన మంత్రికి పాలక మండలి సభ్యులు, అధికారులు ఆలయ మర్యాదాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపీ ఈశ్వర్, ఆలయ అధికారులు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
దుర్గమ్మ సన్నిధిలో మంత్రి సవిత
