-రెండు కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే జనసేన పార్టీ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం ఖరారు చేశారు.
ఈ మేరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా డాక్టర్ దానేటి రాధా రాణిని, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆకుల భవానిని ఎంపిక చేశారు.
అలాగే రాజాం మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్య లత, భీమవరం మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా పాలూరు వెంకటేశ్వరరావును ఖరారు చేశారు.
ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
