మెరుగైన వైద్యం కోసం లబ్ధిదారులకు ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ ఓ సీ లను భవానిపురం లోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,45 వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి నాగ వెంకట కళ్యాణి మరియు కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. పూర్ణానందంపేటకు చెందిన సయ్యద్ మస్తాన్ వలి ( 65) కు రూ. 4 లక్షలు, ఇస్లాం పేటకు చెందిన పఠాన్ యాసిన్ ఖాన్ (53) కు రూ 9.65 లక్షలు చిట్టినగర్ కు చెందిన గూడెల హరీష్ (23) కు రూ 4 లక్షలు, 49 వ డివిజన్ కు చెందిన నాగోతి నటరాజ్ (70) కు రూ 6.60 లక్షల విలువైన ఎల్ ఓ సీ పత్రాలను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాదితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకులు పీవీ చిన సుబ్బయ్య, కామ దేవరాజ్, దాడి అప్పారావు, దేవిన హరి ప్రసాద్, దుక్కా దుర్గారావు, దుర్బేసుల హుస్సేన్, మన్నెం నారాయణరావు, గాలేటి లక్ష్మణరావు, అత్తులూరి సునీల్ తదితరులు పాల్గొన్నారు.