– ఎస్ఈసీ నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి
– ఏఈవోలతో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయకుమార్ బుధవారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు (ఏఈవో), జిల్లా నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్ అనంతరం సమర్పించాల్సిన ఎన్నికల వ్యయ నివేదికల తయారీ, వివరాల నమోదు, పరిశీలనకు సంబంధించిన అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. అభ్యర్థులపై అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలు, పెండింగ్ కేసులు, రిజిస్టర్ల నిర్వహణ, నగదు, మద్యం, ఇతర వస్తువుల స్వాధీనాలు, పెయిడ్ న్యూస్ అంశాలను సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. అలాగే బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపుల ఖర్చులు, అభ్యర్థుల రోజువారీ వ్యయ రిజిస్టర్లు, రాజకీయ పార్టీల ఖర్చులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, వీడియో సర్వైలెన్స్ బృందాలు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తూ, తమ రికార్డులను ప్రతిరోజూ సమర్పించాలని ఆదేశించారు.
ఎన్నికల వ్యయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా నమోదు చేసి, సంబంధిత ఆధారాలతో నివేదికలను సిద్ధం చేయాలని, పోలింగ్ పూర్తయిన అనంతరం నిర్దేశిత గడువులోగా సంతకం చేసిన నివేదికలను సమర్పించా
