Breaking News

All News

టీడీపీకి ఘన విజయాన్ని అందించిన మహిళలకు అండగా ఉంటాం

-త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం అమలు -పవర్‌మెక్‌ ఫౌండేషన్‌ ద్వారా వంద మందికి ఉచితంగా కుట్టుమిషన్లు అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన మహిళలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని గురునానక్‌ కాలనీ రోడ్డులో ఎన్.ఎ.సి. కళ్యాణ మండపంలో పవర్‌ మెక్‌ ఫౌండేషన్‌ సజ్జా కిషోర్‌ బాబు, …

Read More »

‘కెరీర్ గైడెన్స్’ కోర్సులపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి విద్యార్థి చదువుకుని ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని, వారి భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు IAS.,  అన్నారు. బుధవారం విజయవాడలోని సమగ్ర శిక్షా, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ‘యూనిసెఫ్ కెరీర్ సర్టిఫికేట్ కోర్సు రూపకల్పన’ వర్క్ షాపు ముగింపు సభకు ముఖ్యఅతిథిగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,  …

Read More »

కొత్త ప్రైవేటు స్కూళ్లు స్థాపన & అప్ గ్రేడేషన్ కోసం దరఖాస్తులు స్వీకరణ

-పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు.వి IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025-26 విద్యా సంవత్సరమునకు క్రొత్తగా ప్రైవేట్ ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలల ఏర్పాటు మరియు పాఠశాలల అప్ గ్రేడేషన్ కోసం దరఖాస్తులను డిసెంబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమర్పించాల్సి ఉంటుంది. ఈ తేదీల తర్వాత అందిన దరఖాస్తులు స్వీకరించబడవు. పాఠశాల ఏర్పాటు చేసే సదరు ప్రాంతంలో విద్యార్థుల సంఖ్య మరియు అప్పటికే నడపబడుచున్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను బట్టి మరియు అవసరాన్ని …

Read More »

గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ రమణ యశస్వి బాధ్యతల స్వీకరణ

-పాత్రికేయులకు, కుటుంబ సభ్యులకు తక్షణ వైద్యసేవలందించాలి -నిమ్మరాజు వినతి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సుమారు వందేళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ గా రచయిత, బహుగ్రంథకర్త డాక్టర్ రమణ యశస్వి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు, ఏపియుడబ్ల్యూజె ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ఎస్.రవికుమార్, అక్రిడిటేషన్ కమిటీ మాజీ సభ్యులు భట్రాజు శాయి బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా నిమ్మరాజు మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో కూడా …

Read More »

జిల్లాలో 2,65,488 మందికి సుమారు రూ.112.37 కోట్లు నవంబర్ 1 న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ నెల NTR భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ ల పంపిణీ జిల్లాలో 2,65,488 మందికి సుమారు రూ.112.37 కోట్లు పంపిణీ నవంబర్ 1వ తేదీన చేయనున్నట్లు తెలుపుతూ, వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వృద్దాప్యం, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి …

Read More »

నవంబర్ ఒకటి నుండి స్కిల్ సెన్సస్… పూర్తి సమాచారం అందించి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

-జెసి శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోను మరియు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు  ఆదేశాలతో మరియు స్కిల్ డెవలప్మెంట్ శాఖామాత్యులు నారా లోకేష్ సారధ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోని 15 నుండి 59 వయస్సు మద్య గల వ్యక్తులకు సంబందించిన విధ్యా అర్హతలు, ఉద్యోగ అనుభవం మరియు వారి మేరుగైన ఉద్యోగ ఆసక్తులను సేకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి గా తీర్చిదిద్దేందుకు చేపట్టిన బృహత్తర స్కిల్ సెన్సెస్ సర్వే. ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరి మరియు …

Read More »

అర్హులైన పేదలకు కేంద్ర పథకాలు అందించకపోతే చర్యలు తప్పక ఉంటాయి

-దిశ చైర్ పర్సన్ /తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి -అధికారులు చిత్త శుద్ధితో ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కొరకు పనిచేయాలి: కో చైర్ పర్సన్ దిశ /చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు -అర్హులైన పేదలకు, లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమ పథకాలను అందించాలి… దిశా సమావేశానికి గైర్హాజరైతే చర్యలు తప్పవు: దిశ సభ్య కార్యదర్శి/ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా సమన్వయ …

Read More »

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. దుష్టశక్తులను పారద్రోలి కొత్త జీవితానికి స్వాగతం పలికే వెలుగుల రోజే దీపావళి పండగ..ఈ దీపావళి రోజున ప్రజలందరి జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగిపోయి సంతోషాల వెలుగులు ప్రసరించాలని కోరుకుంటున్నాను. ఓ చిన్న దీపం ఆవిరవుతూ అందరికీ వెలుగు ఇస్తుందన్న ప్రేరణతో అందరం ముందుకు సాగుదాం.. చీకటిని తరిమేసి వెలుగులు నింపే పండుగగా, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని ఘనంగా జరుపుకుందాం.. దీపాల శోభతో  ముంగిళ్లు మురవాలని,  సిరి సందపదలతో …

Read More »

విస్తృతస్థాయి సమావేశం విజయవంతం చేయాలి… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం తూర్పు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ 03-11-2024 తేదీన, విజయవాడ శేషాసాయి కళ్యాణ మండపంలో జరగబోయే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో  వైసీపీ  రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, నియోజకవర్గ కార్పొరేటర్లు, ఇంచార్జ్ లు, డివిజన్ …

Read More »

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు :ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవినాష్ మాట్లాడుతూ ఈ దీపాల పండుగ… ప్రజలందరి జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ… దీపావళిని అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని అవినాష్ ప్రకటనలో తెలిపారు.

Read More »