విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జిల్లాలో పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ సంబంధిత యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటకరీ గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ కోన శశిధర్‌లకు వివరించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాల అమలుపై గురువారం పంచాయతీరాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ కోన శశిధర్‌లు సచివాలయం నుండి రాష్ట్రలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ …
Read More »Andhra Pradesh
జిల్లాలలో భూముల రీసర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేలా చర్యలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలలో భూముల రీసర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. ఢల్లీిరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో గురువారం సిసిఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుండి జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకంలో భాగంగా భూముల రీసర్వే ప్రక్రియపై సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ …
Read More »అంబేద్కర్ ఫొటో లకు దండలు… వెనుకనుండి దళితుల పై దాడులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోనసీమ కు అంబేడ్కర్ జిల్లా గా మార్చి నందుకు అమలాపురం లో జరుగుతున్న సంఘటనల వెనుక రాజకీయ దుష్ట శక్తులు ఉన్నాయని ఏపీ ఏపీ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ మద్దుల రామకృష్ణ అన్నారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలకు, ఫోటోలకు వేస్తారని వెనకనుంచి దళితులపై దాడులు చేస్తారని వాపోయారు. ప్రశాంతమైన కోనసీమ ప్రాంతాన్ని అందరూ రాజకీయ లబ్ధి కోసం …
Read More »రోగులకు అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచండి…
-ప్రభుత్వ ఆసుపత్రిపై చులకన భావాన్ని పోగొట్టి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నామన్న భావన కల్పించండి… -ఏ సమయంలోనైన ఆకస్మిక తనిఖీ చేస్తా.. నిర్లక్ష్యం వహిస్తే సహించను… -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్యులు సిబ్బంది రోగుల మధ్య స్నేహపూరిత వాతావారణంలో మెలుగుతూ సేవలను మరింత మెరుగు పరచాలని ఏ సమయంలోనైనా తాను ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించనని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. విజయవాడలోని …
Read More »నగరంలో టిడిపి మాలల ఆత్మగౌరవ సభ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ మాలల ఆత్మ గౌరవ సభ కార్యక్రమం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం జరిగింది. కార్యక్రమంలో ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ రేపు జరగబోయే మహానాడు కార్యక్రమానికి అందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ప్రశాంతమైన కోనసీమ ప్రాంతాన్ని రాజకీయ లబ్ధి కోసం విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు. కోనసీమ కు అంబేద్కర్ పేరు పెట్టడం అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలన్నారు. మాలలకు …
Read More »రాష్ట్ర మహిళా,శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు అరుణాచల ప్రదేశ్ పర్యటన
అరుణాచలప్రదేశ్ (ఇటానగర్), నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనులు, మహిళలు,శిశువులు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమం కొరకు రాష్ట్రంలో మరిన్ని మెరుగైన పథకాలను అమలు పర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళా,శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ కమిటీ అరుణాచలప్రదేశ్ పర్యటనకు వెళ్లింది. రాష్ట్ర మహిళా,శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్ పెర్సన్ మరియు పాలకొండ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో సభ్యులు పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ, నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు ఈ పర్యటనలో పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ …
Read More »ఛలో బెంజ్ కంపెనీని జయప్రదం చేయండి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా ఈనెల 28న మధ్యాహ్నం 12 గంటలకు నగరంలో జరుగు బహిరంగ సభకు పార్టీ శ్రేణులందరూ తరలిరావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. ఈ మేరకు ‘ఛలో బెంజి కంపెనీ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గురువారం ఆంధ్రప్రభకాలనీలోని ఆయన కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దాదాపు 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందుతున్నాయంటే సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం ఎంతగా …
Read More »రాష్ట్రాన్ని స్టేట్ ఆఫ్ టెర్రర్ గా మార్చేందుకు కుట్ర: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-57 వ డివిజన్ 236 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని స్టేట్ ఆఫ్ టెర్రర్ గా మార్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 57 వ డివిజన్ – 236 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గురువారం ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ …
Read More »మహిళా కార్మికులు 400 మందికి కేన్సర్ నిర్ధారణ పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ నందు పనిచేయు కార్మికుల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ఆదేశముల మేరకు వైద్యపరీక్షల శిబిరముల నిర్వహణలో భాగంగా ఇండో అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు మహిళా కార్మికులు 400 మందికి కేన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినారు. ప్రతి ఒక్క మహిళా తప్పనిసరిగా ఈ వైద్యపరీక్షలు నిర్వహించుకొనవలెనని, కేన్సర్ కు భయపడవలసిన అవసరం లేదని కేన్సర్ ను మందులు మరియు మనోధైర్యంతో ఎదుర్కోగలమని …
Read More »రోడ్లు, డ్రైయిన్లు ఆక్రమించి ప్రజలకు అసౌకర్యం కలిగించరాదు
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేదారేశ్వర పేట పండ్ల మార్కెట్ వద్ద మామిడి కాయల వ్యాపారులు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించుటపై స్థానికులు మరియు పాదచారులు నగరపాలక సంస్థ కు పలు ఫిర్యాదులు చేయటం జరిగినది అంతేకాక సదరు వ్యాపారస్తులు తమ వ్యాపార నిర్వహణ కొరకు నగరపాలక సంస్థకు నిర్ణీత రుసుము (ఆశీలు) చెల్లించి అనుమతి పొంది లైసెన్సింగ్ నిబంధనలకు లోబడి వ్యాపార నిర్వహణ చేసుకొనవలసినదిగా ఇప్పటికి మూడు పర్యాయములు నగరపాలక సంస్థ సిబ్బంది, అధికారులు తెలియచేసిననూ …
Read More »