విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా ఈనెల 28న మధ్యాహ్నం 12 గంటలకు నగరంలో జరుగు బహిరంగ సభకు పార్టీ శ్రేణులందరూ తరలిరావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. ఈ మేరకు ‘ఛలో బెంజి కంపెనీ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గురువారం ఆంధ్రప్రభకాలనీలోని ఆయన కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దాదాపు 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందుతున్నాయంటే సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం ఎంతగా పరితపిస్తోందో అర్థమవుతోందన్నారు. 25 మంది సభ్యులున్న రాష్ట్ర కేబినెట్‌లో ఏకంగా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారంటే జగనన్న ఎంత చిత్తశుద్ధితో సామాజిక న్యాయం అమలు చేస్తున్నారో తెలుస్తోందన్నారు. బీసీల ఉనికి చాటేలా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందన్నారు. ఈ అంశాలను ప్రజలకు వివరించేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కావున నగరంలోని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, వివిధ కార్పొరేషన్ల డైరక్టర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు సహా అన్ని స్థాయిలలోని ప్రతిఒక్క నాయకుడు, కార్యకర్తలు పెద్దఎత్తున సభకు హాజరుకావాల్సిందిగా కోరడమైనది.
Prajavartha Online Telugu News