విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ నందు పనిచేయు కార్మికుల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ఆదేశముల మేరకు వైద్యపరీక్షల శిబిరముల నిర్వహణలో భాగంగా ఇండో అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు మహిళా కార్మికులు 400 మందికి కేన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినారు. ప్రతి ఒక్క మహిళా తప్పనిసరిగా ఈ వైద్యపరీక్షలు నిర్వహించుకొనవలెనని, కేన్సర్ కు భయపడవలసిన అవసరం లేదని కేన్సర్ ను మందులు మరియు మనోధైర్యంతో ఎదుర్కోగలమని ఇండో అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ వైధ్యులు డా.సుబ్బారావు అన్నారు. కార్యక్రమములో నగరపాలక సంస్థ CMOH i/c డా.బాబు శ్రీనివాసన్, సహాయ వైద్య అధికారులు శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News