Andhra Pradesh

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత…

-విద్యా రంగానికి బడ్జెట్ లో 16 శాతం నిధులు కేటాయింపు.. -ప్రతి మండలంలోనూ రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు.. -రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 16 శాతం నిధులు కేటాయించి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడ సింగ్ నగర్ లోని ఎమ్ కె. బేగ్ ఉన్నత పాఠశాల నందు నిర్మించిన అదనపు తరగతి గదులను గురువారం …

Read More »

సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్ ని పరిశీలించిన సీఎం

-సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు. సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్ ని సీఎం జగన్ పరిశీలించారు. ఏప్రిల్‌ 5వ తేదీకల్లా భూ సర్వేకోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమవుతాయని, వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామని …

Read More »

344 కిమీల మేర మౌలిక సదుపాయాలను తన నెట్‌వర్క్‌ పరిధిలో జోడించి రికార్డు నెలకొల్పిన దక్షిణ మధ్య రైల్వే

-మునుపెన్నడూ లేనివిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 83 కిమీల నూతన రైల్వే లైన్లు, 197 కిమీల డబుల్‌ రైల్వే లైన్లు, 64 కిమీల మూడవ రైల్వే లైన్లు జోన్‌ పరిధిలో పూర్తి చేయబడినాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో జోన్‌ రైల్వే నెట్‌వర్క్‌కు అదనంగా 344 ట్రాక్‌ కిమీల మేర మౌలిక సదుపాయాలను జోడిరచి నూతన శిఖరాలను అధిరోహించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని నిర్ధేశించిన …

Read More »

విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం

-రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్ ఛార్జీలను పెంచేసి వైసీపీ నాయకత్వం తన పవర్ ఈ విధంగా చూపించుకుంది. ఉగాది కానుకగా రూ.1400 కోట్ల విద్యుత్ ఛార్జీల వడ్డింపుతోపాటు ట్రూ అప్ ఛార్జీల పేరిట మరో రూ. 3వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. ఆదాయం లేదు… రాబడి లేదు … ట్యాక్సులు మీద ట్యాక్సులు మాత్రం వేస్తున్నారు. చెత్త పన్ను, …

Read More »

జనసేన క్రియాశీలక కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని అందచేసిన పవన్ కళ్యాణ్…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన క్రియాశీలక కార్యకర్తలకు చెందిన ఇన్స్యూరెన్స్ ప్రీమియం (2022 – 2023 సంవత్సర కాలానికి) మొత్తాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సి జి ప్రసాద్ , డి జి ఎం లకి చెక్ ను గురువారం ఉదయం తన నివాసంలోఅందించారు. ఈ ఇన్స్యూరెన్స్ ఏప్రిల్ ఒకటి 2022 నుంచి అమలులోకి వస్తుంది. ఈ సమావేశంలో పార్టీ ఇన్స్యూరెన్స్ పాలసీ సలహాదారు  వెంకట నరసింహారావు యడ్ల, మరియు పార్టీ కోశాధికారి  ఎ.వి. రత్నం పాల్గొన్నారు.

Read More »

రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ లను సత్వరంగా ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి… : వేముల శ్రీనివాస్     

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనేక రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్సుగా మారుతున్న అజిత్ సింగినగర్ లోని డాబాకోట్ల రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ లను సత్వరంగా ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని విజయవాడ నగర డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి కి వినతి పత్రాన్ని ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ అందజేశారు. గురువారం విజయవాడ నగరంలో గల అజిత్ సింగ్ నగర్ కృష్ణాహోటల్ సెంటర్ నందు గల డిప్యూటీ మేయర్  కార్యాలయం నందు డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి ని కలిసి నగరంలోని ప్రధాన రోడ్డులు, …

Read More »

పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన…

-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. గురువారం విజయవాడ లెనిన్ సెంటర్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్, నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ మోడీ, జగన్ ఇద్దరూ ఒక్కటేనని కలిసి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మోడీ ఆదేశాలతోనే జగన్ పన్నులు, విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. …

Read More »

4.91 లక్షల మంది పెన్షనర్లకు రూ.124.56 కోట్లు విడుదల… : కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద జిల్లా వ్యాప్తంగా 4.91 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. మార్చినెల పెన్షన్ మొత్తాలను ఏప్రిల్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటివద్ద, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సంకల్పంలో భాగంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శుక్రవారం (ఏప్రిల్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని …

Read More »

1-1-2022నాటికి 18 సం॥దాటిన వారు ఓటరుగా నమోదు చేయించుకోవాలి….

-తాసిల్దారు వేమూరు K.మోహనరావు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : వయసు 18 సం॥రాలు దాటిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని వేమూరు తహసిల్దారు K.మోహనరావు అన్నారు. గురువారం మార్చి వేమూరు నియోజకవర్గ పరిధిలోని వేమూరు నందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశానుసారం స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థులకు ఓటరు నమోదు ఎన్ని సంవత్సరాలకు చేసుకోవాలి ! ఏ రకంగా ఓటు నమోదు చేసుకోవాలి ?అనే పలు విషయమై వారికి అవగాహన సదస్సు నిర్వహించడం …

Read More »

వైయస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దం… : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

– 61.03 లక్షల మంది పెన్షనర్లకు రూ.1551.16 కోట్లు విడుదల – అయిదు రోజుల్లో నూరుశాతం పెన్షన్ల పంపిణీ – డిఆర్డిఎ కాల్ సెంటర్ల ద్వారా పర్యవేక్షణ – ఆర్బిఐఎస్ ద్వారా పెన్షనర్ల ఫేషియల్ అథెన్టికేషన్ – లబ్ధిదారులకు బయోమెట్రిక్, ఐరిస్ విధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద రాష్ట్ర వ్యాప్తంగా 61.03 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక …

Read More »