Breaking News

Andhra Pradesh

పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రత పాటించాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల పై ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యకుండా పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రత పాటించాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా దొమ్మేరు, అరికిరేవుల , కుమారదేవం, నందమూరు, తొగుమ్మి , వేములూరు, వాడపల్లి , ఐ. పంగిడి గ్రామాలకు పంపిన చెత్త సేకరణ ఆటోలను మంత్రి …

Read More »

దిరిసిపోము యిర్మీయా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : దిరిసిపోము యిర్మీయా ఇల్లు అగ్నిప్రమాదం కి గురైన సందర్భంలో గ్రామస్థులు స్పూర్తితో స్పందించడం అభినందనీయమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం ఇటీవల దొమ్మేరు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కె. శివ రామ కృష్ణ లతో కలిసి పరామర్శించిన శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

కలిదిండి మండలంలోని 1450 మంది డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ ఆసరాగా రెండోవ విడత రూ. 14 కోట్లు పంపిణీ…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : ఆసరా సంబరాలను పెద్దఎత్తున విజయవంతం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచెప్పిన కైకలూరు నియోజకవర్గ అక్కచెల్లమ్మల రుణం ఎప్పటికి తీర్చుకోలేనిదని, ఇదే ఆప్యాయత, అభిమానం మీ నుండి కోరుకుంటూ మీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలిదిండి మండలం తాడినాడ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా రెండోవ విడత కార్యక్రమానికి ఎమ్మేల్యే డిఎన్ఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భేంగా ఆయన మాట్లాడుతూ ముందుగా కలిదిండి మండల అక్కచెల్లమ్మలకు …

Read More »

అనులో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు…

-అను హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి -ఘనంగా అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ మూడవ వార్షికోత్సవం -వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్డియాక్ హెల్త్ చెకప్ ప్యాకేజీల ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అను హాస్పిటల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎనికేపాడులో నిర్వహింపబడుతున్న అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ నందు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తున్నామని అను హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి పేర్కొన్నారు. అను ఇనిస్టిట్యూట్ మూడవ వార్షికోత్సవ …

Read More »

మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుంది !!… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆర్థిక సాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి మహిళలకు వైఎస్సార్ చేయూత నిధులు అందిస్తూ, మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుందని మన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. సోమవారం ఉదయం ఆయన విజయవాడ పటమట దత్తానగర్ లోని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొనేందుకు …

Read More »

రేపే ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినం

-ఈ నెల 20 కి బదులు 19 కి మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను ఈ నెల 19 కి మారుస్తూ ప్రభుత్వం జి.ఓ.ఆర్టీ.నెం.1707 ను సోమవారం జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను గతంలో ప్రకటించినట్లుగా ఈ నెల 20 కి బదులు 19 కి మార్చాలని ప్రభుత్వం నిర్ణయం …

Read More »

నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్, వార్డుమెంబర్లకు పంచాయితీ చట్టాలపై అవగాహన…

-కాలుష్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి… -యంపీపీ గద్దే పుష్పరాణి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్దితో పాటు అర్హులైనవారందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో గ్రామ పంచాయితీ పరిపాలనా వ్యవహారాలను క్షుణ్ణంగా తెలుకొనేందుకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని గుడివాడ మండల ఎంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. గుడివాడ రూరల్ మండల పరిదిలో నూతనంగా ఎన్నికైన గ్రామ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లకు సోమవారం స్థానిక యంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయితీ రాజ్ చట్టాల అవగాహపై రెండురోజుల …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-గృహనిర్మాణసంస్థ ద్వారా రుణాలు పొంది తిరిగి చెల్లించని వారికి వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా వారి ఇంటిని రిజిస్ట్రేషన్ చేస్తుంది. -18 నుంచి 45 ఏళ్ళ వయస్సుగల వాళ్లందరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి.. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం 1983 నుంచి మంజూరు చేసిన ఇళ్లస్థలాల్లో ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం గృహనిర్మాణ సంస్థ ద్వారా అప్పుతీసుకొని తీర్చని వారి రుణాలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆర్డీవో …

Read More »

వైఎస్సార్ ఆసరా… ఇచ్చింది ఆర్థిక భరోసా…

-4 విడతల్లో డ్వాక్రా రుణ మాఫీ జరుగుతోంది… బి నాగలక్ష్మి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఒక ఆలోచన …మహిళలు కోసం ఒక అన్నగా, పిల్లలకు మేనమామ లా అనునిత్యం సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుని రావడం ఎంతో ఆనందంగా ఉందని భువనగిరి నాగలక్ష్మి తెలిపారు. కొవ్వూరు మండలం కుమారదేవరం గ్రామానికి చెందిన బి. నాగలక్ష్మి ప్రభుత్వం అందించిన వివిధ పథకాల ద్వారా పొందిన లబ్ది ఆమె మాటల్లో… జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత తనకు, తన కుటుంబానికి 29 …

Read More »

గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధముగా మహిళలకు ఆర్థిక భరోసా… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి మహిళా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాదరికతకు కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం స్క్రూ బ్రిడ్జి వద్ద పాత విబియన్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన 9,15,16,19 డివిజిన్ల రెండవ విడత వైయస్సార్ ఆసరా పథకం లబ్ధిదారులతో జరిగిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ ఆయా డివిజన్ ల పరిధిలో 697 గ్రూపులకు …

Read More »