స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-గృహనిర్మాణసంస్థ ద్వారా రుణాలు పొంది తిరిగి చెల్లించని వారికి వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా వారి ఇంటిని రిజిస్ట్రేషన్ చేస్తుంది.
-18 నుంచి 45 ఏళ్ళ వయస్సుగల వాళ్లందరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి..
-ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం 1983 నుంచి మంజూరు చేసిన ఇళ్లస్థలాల్లో ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం గృహనిర్మాణ సంస్థ ద్వారా అప్పుతీసుకొని తీర్చని వారి రుణాలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆర్డీవో శ్రీనుకుమార్ తెలిపారు.
స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ఇచ్చిన అర్జీలు సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి వారికి న్యాయం చెయ్యాలన్నారు. తమ పరిధిలోని కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందున్న డివిజన్ పరిధిలో గల మండల స్థాయి, గ్రామ స్థాయిలోని సచివాలయాల్లో ఏ ఒక్క అర్జీ పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా 1983 నుంచి ఇప్పటి వరకు అర్హులైన లబ్దిదారులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసిందన్నారు. ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం సంబందిత స్థల యజమానులు గృహనిర్మాణ సంస్థ లో వారికి అలాట్ చేసిన పట్టాను తాకట్టు పెట్టి అప్పుతీసుకొని తిరిగి చెల్లించని వారు గుడివాడ డివిజన్ పరిధిలో సుమారు 40 వేలవరకు ఉన్నారన్నారు. వీరందరికీ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్ కోరారు. గృహనిర్మాణ సంస్థ నుంచి పట్టాను విడిపించుకునేందుకు గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతంలో రూ. 20 వేలు, కార్పోరేషన్ పరిదిలో అయితే రూ.30 వేల రూపాయలను సమీపంలో గల గ్రామ, వార్డు సచివాలయాల్లో నగదు చెల్లిచాల్సి ఉంటుందన్నారు. తదుపరి మీపేరు మీదనే ప్రభుత్వం ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబందించి విలేజ్ అసిస్టెంట్లు, పంచాయితీ సెక్రటరీలు, వాలెంటీర్లు ఇటువంటి ఇళ్లను గుర్తించి డిమాండ్ నోటీసులు అందిస్తున్నారన్నారు.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా డివిజన్ పరిధిలో 18 నుంచి 45 ఏళ్లు లోపు గల వారందరికీ పీహెచ్ సీలు, సచివాలయాలు ద్వారా వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ జరుతుందన్నారు. వ్యాక్సిన్ ఇప్పటి వరకు తీసుకోనివారు, రెండో మోతాదు తీసుకోవలసిన వారు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కోవిడ్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని, మాస్కులు ధరించడం, శానిటేషన్ వినియోగం, బౌతిక దూరం పాటించడం తప్పని సరిగా పాటించాలన్నారు. స్పందన ద్వారా కార్యాలయానికి 5 అర్జీలు వచ్చాయని వాటిని పరిష్కారం నిమిత్తం సంబందిత శాఖాధికారులకు పంపించామని ఆర్డీవో శ్రీనుకుమార్ తెలిపారు.
అర్జీలు.. గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామానికి చెందిన జి. నాగేంద్రరావు వారి అర్జీలో తనకు మత్స్యకారులు పెన్షన్ అందించాలని కోరారు. గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామ పరిధిలో గల ఆవులదొడ్డి ప్రాంతంలో ప్రభుత్వ పోరంబోకు భూమిలో గ్రామంలోని కొందరు అక్రమంగా చెరువు త్రవ్వడం వలన ప్రక్కనే ఉన్న డ్రైనేజి పూడిపోయి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కావున సమస్యను పరిష్కరించాలని తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు వారి అర్జీలో కోరారు.
నందివాడ మండలం నూతలపాడు గ్రామ నివాశి గొల్ల సుందరరావు తన అర్జీలో ఆరోగ్య శ్రీ ద్వారా గుండెకు సంబందించిన శస్త్ర చికిత్స చేయించుకున్నానని, ప్రస్తుతం ఏ పనికి వెళ్లలేని స్థితిలో ఉన్నందున పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
గుడివాడ ధనియాల పేట లోనీ బాఓజి మఠంలో ప్రభుత్వం పేద ప్రజలకు అందించిన భూములలో రిజర్వ్ సైట్ కింద వదిలిన ఎకరం భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని గుడివాడ టిడిపి అధ్యక్షులు రాంబాబు మరియు టిడిపి నాయకులు బావోజి మఠం ప్రజలు ఆర్డిఓకు వినతి పత్రాన్ని అందించారు.
కార్యక్రమంలో కార్యాలపు ఏవో స్వామినాయుడు, డీటీ బాలాజీ, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర అధికారిణి గురవమ్మ, ఆర్ డబ్ల్యూఎస్.ఈఈ లీలా కృష్ణ, డ్రైనేజీ ఏఈ ప్రసాద్, ఆర్ అండ్ బీ కార్యాలపు సీ.అ. మహేష్, కోపరేటివ్ కార్యాలపు జూ.అ. గోవీనాధ్, ఐసీడిఎస్ సూపర్ వైజర్ బేబీ సరోజిని తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *