విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ‘పక్కా కమర్షియల్’ చిత్ర యూనిట్ సందడి చేసింది. జూలై ఒకటో తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా యూనిట్ సభ్యులు నగరంలోని రాజ్-యువరాజ్ (జీ3) థియేటర్లకు విచ్చేశారు. ఈ సందర్భంగా యూనిట్ మీడియా శనివారం సమావేశం నిర్వహించింది. హీరో గోపీచంద్ మాట్లాడుతూ ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందని ఖచ్చితంగా సినీ అభిమానులను అలరించేలా వినోదాత్మకంగా పక్కా కమర్షియల్ సినిమా వుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో రూపొందించామని …
Read More »Latest News
రైతుబజార్లలలో నిర్థేశించిన ధరలకు నాణ్యమైన కూరగాయలను విక్రయించాలి…
-స్వరాజ్ మైదాన్ రైతుబజారుకు ప్రత్యామ్నాయంగా నగరంలో మరో నాలుగు రైతుబజార్లు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రైతుబజార్లను మరింత పటిష్టపరచి ప్రభుత్వం నిర్థేశించిన ధరలకే వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను విక్రయించేలా చర్యలు తీసుకుంటామని స్వరాజ్ మైదాన్ రైతుబజారుకు ప్రత్యామ్నాయంగా నగరంలో మరో నాలుగు రైతుబజార్లను త్వరలో ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు. మెగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న రైతుబజారును శనివారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మైలవరం తిరువూరు …
Read More »కరోనా వైరస్ కంటే భయంకరం డ్రగ్స్ వినియోగం…
-ప్రతి విద్యార్థి ఒక పోలీస్‌లా డ్రగ్స్‌ను అరికట్టేందుకు కృషి చేయాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డ్రగ్స్ వినియోగం కరోనా వైరస్ కంటే అతి భయంకరమైనదని ప్రతి విద్యార్థి డ్రగ్స్ వినియోగం పై అవగాహన పెంచుకుని అరికట్టేందుకు ఒక పోలీస్ మాదిరిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విద్యార్థులకు పిలుపు నిచ్చారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక మెగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో శనివారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేక …
Read More »ప్రభుత్వ భవన నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ భవన నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని నిర్ధేశించిన కాలానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఉపాధి హామి పథకంలో చేపడుతున్న గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు తదితర ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల ప్రసుత ప్రగతి, నిర్మాణాలకు అవసరమైన సిమ్మెంట్ సరఫరా వంటి పలు అంశాలపై శనివారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి …
Read More »‘‘టొబాకో ఫ్రీ జోన్’’గా ఇంద్రకీలాద్రి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడ ఒకటి. రోజూ వందల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. పండుగలు, పర్వదినాల్లో భక్తుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుమల తరహాలోనే ఇంద్రకీలాద్రిని కూడా ‘‘టొబాకో ఫ్రీ జోన్’’గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన డిక్లరేషన్‌పై కలెక్టర్ ఢిల్లీ రావు, ఆలయ ఈవో, డీఎంహెచ్‌వో సంతకాలు చేశారు. భక్తులు, ఆలయ సిబ్బంది కచ్చితంగా ఈ నిబంధన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘టొబాకో నియంత్రణలో భాగంగా సిగరెట్, …
Read More »జూలై 5 న జరిగే బందును విజయవంతం చేయండి… : షేక్ జలీల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం హక్కుల కోసం జులై 5న జరిగే రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం హక్కులను కాలరాస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షేక్ లు , సయ్యద్ లు , పఠాన్ …
Read More »దివ్యాంగుల ఆత్మబంధువు సీఎం వైఎస్ జగన్ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, చెవిటి మిషన్లు అందజేత -రూ. లక్షా 46 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల హక్కులు, చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ.. వారు గౌరవవంతమైన జీవితాన్ని గడిపేందుకు జగనన్న ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యేని ఉపకరణాల కోసం కొందరు దివ్యాంగులు విన్నవించడం జరిగింది. స్పందించిన ఆయన విభిన్న ప్రతిభావంతుల, …
Read More »నిషేధిత భూముల తొలగింపు మేళా సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిషేధిత భూముల జాబితా సెక్షన్ 22(ఏ) లో ఉన్న భూముల తొలగింపు మేళా ద్వారా ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూసమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నార్త్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జరిగిన నిషేధిత భూముల జాబితా నుండి తొలగింపు మేళాలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ నెల …
Read More »సీఎం వైఎస్ జగన్ పాలన ఒక స్వర్ణయుగం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-31వ డివిజన్ 213 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఒక స్వర్ణయుగంగా సాగుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శనివారం 31 వ డివిజన్ – 213 వ వార్డు సచివాలయం పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం, పార్టీ శ్రేణులతో కలిసి రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. …
Read More »అవయవదానంతో మరికొందరికి పునర్జన్మ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి మరణం తరువాత కూడా జీవించి ఉండేందుకు అవయవదానం ఒక మంచి మార్గమని క్యాపిటల్ హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నె హరీష్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన పొట్టి చంద్రిక(52)అనే మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స నిమిత్తం శుక్రవారం ఉదయం పోరంకిలోని క్యాపిటల్ హాస్పటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆమె ప్రాణం కాపాడేందుకు క్యాపిటల్ హాస్పటల్ వైద్య బృందం ఎంతగానో శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో అదేరోజు సాయంత్రం చంద్రికకు …
Read More »