Breaking News

దివ్యాంగుల ఆత్మబంధువు సీఎం వైఎస్ జగన్ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే చేతులమీదుగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, చెవిటి మిషన్లు అందజేత
-రూ. లక్షా 46 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగుల హక్కులు, చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ.. వారు గౌరవవంతమైన జీవితాన్ని గడిపేందుకు జగనన్న ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యేని ఉపకరణాల కోసం కొందరు దివ్యాంగులు విన్నవించడం జరిగింది. స్పందించిన ఆయన విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ట్రైసైకిళ్లు, చెవిటి మిషన్లను మంజూరు చేయించడం జరిగింది. వీటిని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో శనివారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నలుగురికి మంజూరైన రూ. లక్షా 46 వేల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోరకాల పథకాలను అమలు చేస్తోందన్నారు. దివ్యాంగుల సాధికారతకు అవసరమైన శారీరక, వైద్య, ఆర్థిక తదితర అంశాల్లో వారికి తోడ్పాటును అందిస్తోందన్నారు. సమాజంలో వారిపై ఉన్న వైఖరి, అవరోధాలను తొలగించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే దివ్యాంగులకు నెలవారీ పెన్షన్‌ ను రూ.3 వేలకు పెంచినట్లు మల్లాది విష్ణు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 2,423 మంది దివ్యాంగులకు క్రమం తప్పకుండా ప్రతినెలా ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కనుక అర్హులైన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరోగ్యశ్రీ పథకం పేదలకు సంజీవని వంటిదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని జబ్బులకు కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఈ మూడేళ్లలో 885 మందికి రూ. 4 కోట్ల 10 లక్షల 6 వేల రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజకవర్గంలో అందజేయడం జరిగిందన్నారు. 86 మందికి రూ. 2 కోట్ల 23 లక్షల 12 వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసి పత్రాలను అందించినట్లు చెప్పారు. మొత్తంగా రూ. 6.33 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. రోగులు కూడా ఆరోగ్యశ్రీ ఉన్న ఆస్పత్రులపై అవగాహన కలిగి ఉండాలని మల్లాది విష్ణు అన్నారు. ఇందుకోసం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఓ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. అహర్నిశలు ప్రజల్లో ఉంటూ ప్రజల బాగోగులను చూసే నాయకుడు ఎమ్మెల్యేగా ఉండటం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన చేసిన మేలుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆత్మకూరు సుబ్బారావు, ఒగ్గు విక్కీ, కొల్లూరు రామకృష్ణ, చల్లా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *