Breaking News

Latest News

కరోనాను ఎదుర్కొనేందుకు వాక్సినేషన్ ఒక్కటే మార్గం…

-ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ చేపట్టండి : అధికారుల టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు వాక్సినేషన్ ఒక్కటే సురక్షిత మార్గమని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి బుధవారం సాయంత్రం వైద్యాధికారులతో కలిసి మండల, మునిసిపల్ స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ …

Read More »

సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ విస్తృతంగా పర్యటన…

తోట్ల వల్లూరు/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తోట్లవల్లూరు మండలంలోని దక్షిణ వల్లూరు, చాగంటిపాడు, యాకమూరు, గరికపర్రు, దేవరపల్లి, వల్లూరుపాలెం, చినపులిపాక రొయ్యూరు గ్రామాలలో బుధవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి తీరును పరిశీలించారు.ఆయా గ్రామాల్లో హౌసింగ్ లే అవుట్లను పరిశీలించారు. పాములలంక గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదించబడిన భూమిని కలెక్టర్ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ తనిఖీ చేశారు. అనంతరం చాగంటిపాడు గ్రామంలో సచివాలయాన్ని తనిఖీ చేసారు.

Read More »

ప్రతి ఒక్కరు సేవా దృక్పదంతో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయల ప్రత్యేక అధికారిణిగా బాద్యతలు స్వీకరించిన నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ (జనరల్) డా.జె.అరుణ బుధవారం కౌన్సిల్ హాల్ నందు 286 వార్డ్ సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది యొక్క విధులను అడిగి తెలుసుకొని ప్రతి ఒక్కరు సేవా దృక్పదంతో ప్రజలకు మెరుగైన సేవలను అందించేలా, భాద్యతగా తమకు కేటాయించిన విధులు సక్రమముగా నిర్వహించాలని అన్నారు. ప్రతి సచివాలయం నందు …

Read More »

డివిజన్లో ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు…

-రోటరీ నగర్ నందు కమ్యూనిటి హాల్ నిర్మాణమునకు అంచనాలు తయారు చేయాలి… – మంత్రి వర్యులు -డివిజన్లో ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు – మేయర్ రాయన భాగ్యలక్ష్మి -45వ డివిజన్ లో పర్యటించిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 45వ డివిజన్ నందలి పలు వీధులలో దేవాదాయశాఖ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలసి పర్యటించి స్థానికంగా ప్రజలకు ఎదురౌతున్న ఇబ్బందులు మరియు …

Read More »

రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి… : మల్లాది విష్ణు 

-నీచ సంస్కృతికి మర్రి విత్తనం చంద్రబాబు… -టీడీపీ బంద్ కు సొంత పార్టీ నేతలే దూరం -ఫ్రస్ట్రేషన్‌ లో ఎంత నీచానికైనా దిగజారుతారా..? : ఎమ్మెల్సీ కరీమున్నీసా -అంపశయ్యపై ఉన్న పార్టీని బ్రతికించుకునేందుకు చంద్రబాబు దుష్ట రాజకీయాలు : పూనూరు గౌతమ్ రెడ్డి -టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల శాంతియుత నిరసనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాలలో నీచమైన భాష, పదజాలానికి అంకురార్పణ చేసిందే తెలుగుదేశం పార్టీ అని.. దానిని మేము కేవలం ప్రతిఘటించామని …

Read More »

పట్టాభి చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి… : కడియాల బుచ్చిబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం శిఖామణి సెంటర్ వద్ద బుధవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ నేత పట్టాభి రాం చేసిన వ్యాఖ్యలు ని ఖండిస్తూ వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు ఆధ్వర్యంలో శిఖామణి సెంటర్ లో రోడ్డు పై నిరసన వ్యక్తం చేసిన వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు. కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ జగన్ కి దక్కుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ …

Read More »

జులూస్ లో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు  పోతిన వెంకట మహేష్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాషనే ఈద్ మీలాదున్నబి సందర్భంగా వన్ టౌన్ పంజా సెంటర్ నుంచి కాళేశ్వరరావు మార్కెట్ జుమ్మ. మస్జిద్ వరకు దావతే ఇస్లామి ఆర్గనైజర్ సలీమ్ అధ్వర్యంలో నిర్వహించిన జులూస్ లో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు  పోతిన వెంకట మహేష్  పాల్గొని అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం సోదరులతో కలిసి జులూస్ లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్. అమీర్ భాష ,షేక్.గాయసుద్దిన్, ఏజస్.షేక్, సయ్యద్ అబ్దుల్ నజీబ్,మోహమద్ధ్ …

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా నిరుపేదలు ఎవరు ఇబ్బందులు పడకూడదు అనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదల వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారని వైస్సార్సీపీ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గుణదాల తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ 3,5 డివిజిన్లకు చెందిన చింతలచేరువు దాసు,దివ్య లకు మంజూరు అయిన …

Read More »

అదుపులోనే అతిసార…

-తగ్గేవరకు వ్తెద్యశిబిరాల కొనసాగింపు -మాంసాహారం కొద్దిరోజులు మానండి. -పరిసరాలు శుఁభంగా ఉంచండి -డి.ఎం.అండ్ హెచ్ .ఓ ఎం. సుహాసిని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఎనికేపాడు గ్రామ పంచాయతీ ఏరియాలో ఎస్వీఅర్ కాలనీలో వచ్చిన అతిసార వ్యాధి వ్యాప్తి చెందిన వార్త వ్యాపించడంతో ఆ ప్రాంతాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయ అంటువ్యాధుల బృందంతో కలసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డా.మాచర్ల సుహాసిని తనిఖీ చేసి ఆ ఏరియా పరిసరాలు పర్యటించి వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. …

Read More »

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం…

-పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు -ఇన్ ఛార్జ్ కలెక్టరు డా. కె. మాధవిలత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 21వ తేదీన విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఇన్ ఛార్జ్ కలెక్టరు డా. కె. మాధవిలత తెలిపారు. 21వ తేదీన ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ …

Read More »