Breaking News

Latest News

కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ నందమూరి నగర్లోని తోటవారి వీధిలో రూ. 13.59 లక్షల వ్యయంతో చేపట్టనున్న క్రాస్ రోడ్ల నిర్మాణం, మంచినీటి పైపులైన్ల ఏర్పాటు పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆశించిన స్థాయిలో నగరంలో అభివృద్ధి పనులు …

Read More »

దానాలన్నింటిలోనూ అన్నదానం మహాశ్రేష్టమైనది… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శనివారం ఆలయాలు, మండపాలలో అమ్మవారికి భక్తులు పంచామృతాభిషేకం నిర్వహించి.. వివిధ రకాల పుష్పాలు, కుంకుమలతో ఆరాధించారు. అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ, లూనా సెంటర్, గవర్నర్ పేట, దుర్గ అగ్రహారం, బర్మాకాలనీ, ప్రజాశక్తి నగర్ సహా పలు ప్రాంతాలలో నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని …

Read More »

శ్రీ షిర్డీ సాయిబాబా 103 వ పుణ్యతిధి  మహోత్సవం… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : షిర్డీ సాయినాధుని యొక్క 103 వ పుణ్యతిధి  మహోత్సవ సందర్భముగా ముత్యాలంపాడు శ్రీ షిర్డీ సాయిబాబా మందిరములో శనివారం ఘనంగా పుణ్యతిధి మహోత్సవ వేడుకలు జరిగాయి.  అందులో భాగముగా శనివారం ఉదయం  బాబా వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం షిర్డీలో బాబా వారు 1918 వ సంవత్సరములో మధ్యాహ్న సమయంలో ఏకాదశి ఘడియల్లో సుమారు  2 గంటల 30 నిమిషములకు సమాధి చెందిన విషయం మనకు చరిత్ర ద్వారా అవఘతమవుతున్నది అదేవిధముగా ఈ రోజు ఏకాదశి ఘడియలు మధ్యాహ్నం 1 గంట …

Read More »

రెవెన్యూ సేవలను అందించడానికి భూమి రికార్డులను ప్రక్షాళన చేయడం అవసరం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ లో సమర్థవంతంగా రెవెన్యూ సేవలను అందించడానికి భూమి రికార్డులను ప్రక్షాళన చేయడం అవసరం అని కొవ్వూరు ఆర్డీఓ ఎస్. మల్లి బాబు అన్నారు. శనివారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం లో తాళ్ళ పూడి, కొవ్వూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, గ్రామ రెవెన్యూ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లా డుతూ డివిజన్ లో భూమి రికార్డు లను స్వచ్చ పరచి, ప్రక్షాళన చేసే ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. …

Read More »

వాడపల్లి గ్రామంలో రైతులకు సబ్సిడీపై పవర్ ట్రిల్లర్లు అందిస్తున్నాము… : మంత్రి తానేటి వనిత

-రైతులకు రూ.27.90 లక్షల ఖరీదు చేసే 15 పవర్ ట్రిల్లర్లు అందచేత కొవ్వూరు/వాడపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : మనది రైతు, మహిళా సంక్షేమ ప్రభుత్వమని , రైతులు ఆర్ధికంగా లాభసాటి గా ఉండేందుకు సబ్సిడీపై పవర్ ట్రిల్లర్లు అందిస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం వాడపల్లి గ్రామంలో రెండు రైతు సహకార సంఘాలకు 15 పవర్ ట్రిల్లర్లు మంత్రి చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ …

Read More »

సంక్షేమానికి, నమ్మకానికి నిదర్శనం జగనన్న… : మంత్రి తానేటి వనిత

-కొవ్వూరు మండలం రూరల్ గ్రామాల్లో మంత్రి సుడిగాలి పర్యటన -10 గ్రామాల్లో వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కొవ్వూరు రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ ఆసరా రెండో విడత ద్వారా కొవ్వూరు మండలం లో ఈరోజు పది గ్రామాల్లోని 935 ఎస్.హెచ్.జి. గ్రూపు ల్లోని మహిళలకు రూ.7 కోట్ల 17 లక్షలు నగదు వారి ఖాతాల్లోకి జమ చేశామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఇచ్చిన మాటకి కట్టుబడే నాయకుడు జగనన్న మాత్రమే అన్నారు. …

Read More »

విద్యుత్‌ కోతలపై దుష్ప్రచారాన్ని ఖండించిన రాష్ట్ర ఇంధనశాఖ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్‌ కోతలపై దుష్ప్రచారాన్ని ఖండించిన రాష్ట్ర ఇంధనశాఖ ఖండించింది. దసరా పండుగ తర్వాత గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో, నగరాల్లో లోడ్‌ రిలీఫ్‌ పేరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇంధనశాఖ అధికారులు ఖండించారు. విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఎపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న …

Read More »

ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత అనుగ్రహం ఉండాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మాత ఆశీస్సులతో రాష్ట్రం, ప్రజలు అందరూ సుఖ:శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత అనుగ్రహం ఉండాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం పార్లమెంటరీ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో విజయదశమి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా కార్యక్రమాలు చాగల్లు గ్రామంలో …

Read More »

కన్నుల పండుగ్గా తెప్పోత్సవం…

-భక్తిపారవశ్యంతో పులకరించిన దుర్గా ఘాట్… -జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ అంటూ జగన్మాతను స్మరించుకున్న భక్తజనకోటి… ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవత శ్రీ కనక దుర్గాదేవికి పవిత్ర కృష్ణానదిలో హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు. హంసవాహనంపై ఉత్సవ విగ్రహాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్‌ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించిన హంస వాహనంలో ఆదిదంపతులు దుర్గామల్లేశ్వరస్వామివార్లు కొలువుతీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. దాదాపు గంటన్నరపాటు తెప్పోత్సవం వైభవంగా …

Read More »

శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న దుర్గమ్మ ఆలయాల్లో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా అద్భుతంగా జరిగాయని, ఇందుకు అన్ని శాఖలు, ముఖ్యంగా భక్తులు, మీడియా సహకారం ఎంతో ఉందని రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయదశమి పర్యదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్లు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలోని అన్నిశాఖల …

Read More »