కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ నందమూరి నగర్లోని తోటవారి వీధిలో రూ. 13.59 లక్షల వ్యయంతో చేపట్టనున్న క్రాస్ రోడ్ల నిర్మాణం, మంచినీటి పైపులైన్ల ఏర్పాటు పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆశించిన స్థాయిలో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గత తెలుగుదేశం పాలనలో నగరం పూర్తి నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలోనూ ఘోరంగా విఫలమయ్యారని పేర్కొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వెల్లడించారు. మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో పార్కులు, ఆర్.యూ.బి.లు., ఆర్.ఓ.బి.లు., పోలీస్ స్టేషన్ ను మంజూరు చేయించడం జరిగిందని.. ఈ వివరాలన్నింటినీ జీవోలతో సహా వెల్లడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 14వ , 15 వ ఆర్థిక సంఘం నిధులతో పాటుగా ముఖ్యమంత్రి నిధుల నుంచి కూడా నగర అభివృద్ధికి విశేషంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. 15 వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన మంచినీటి ట్యాంకు నిర్మాణ పనులను సైతం త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేశారు. ఒక్క 58వ డివిజన్ లోనే ఈ రెండేళ్లలో రూ. 9 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టగా.. రూ. 5 కోట్ల పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. మరో రూ. 4 కోట్ల పనులు వివిధ దశలలో ఉన్నట్లు వెల్లడించారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు ఉమ్మడి వెంకట్రావు, అఫ్రోజ్, శోభన్, నాగేశ్వరరావు, రమేష్, శర్మ, కృష్ణమోహన శాస్త్రి, ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *