విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 10 లక్షల మంది కిశోర బాలికలకు రుతుక్రమ సమయంలో వచ్చే ఇబ్బందులకు చరమగీతం పాడేందుకు స్వేచ్ఛ అనే వినూత్న పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మంగళవారం పటమట బాలుర జడ్ పి ఉన్నత పాఠశాల నుంచి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనితతో కలసి జిల్లా కలెక్టర్లతో వర్చ్యువల్ పద్దతిన స్వేచ్ఛా కార్యక్రమాన్ని ప్రారభించారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్, జేసి (అభివృద్ధి) ఎల్.శివశంకర్, విజయవాడ సెంట్రల్ ఎంఎ మల్లాది …
Read More »Latest News
గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయండి…
-అధికార్లను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చి సహకరించిన నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. స్థానిక జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం గన్నవరం విమానాశ్రయ విస్తరణకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలుపై రెవిన్యూ అధికార్లతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా డా. మాధవీలత మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయ …
Read More »పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వేలమూరి శేషాచలపతి శర్మ ఆధ్వర్యంలో పైపుల రోడ్డు కనకదుర్గమ్మ వారి ఆలయం సమీప కరకట్ట వద్ద 108 మందార మొక్కలను నాటే కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ రెడ్డి తో కలిసి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమాల స్పూర్తితో వేలమూరి శేషాచలపతి శర్మ …
Read More »విద్యుత్ రంగాన్ని నష్టాల్లోకి నెట్టింది చంద్రబాబే… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-రైతులపై కేసులు పెట్టి జైళ్లకు పంపిన ఘనత తెలుగుదేశానిది -విద్యుత్ పంపిణీ సంస్థలకు.. చంద్రబాబు ఒక్క రూపాయీ చెల్లించలేదు -టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.32,000 కోట్లకు చేరుకున్న అప్పులు -విద్యుత్ సంస్థలను ఆదుకున్న జగనన్న ప్రభుత్వం -2019–21 మధ్య రూ.28,166 కోట్లు విడుదల : ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న …
Read More »అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకాలకు దూరం కాకూడదు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-వార్డు సచివాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు -సిబ్బంది జవాబుదారీతనంగా వ్యవహరించాలి -ఈబీసీ నేస్తానికి గడువులోగా అర్హులచే దరఖాస్తులు చేయించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కులమతాలకతీతంగా శాచ్యురేషన్ పద్థతిలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురం, ముత్యాలంపాడులోని వార్డు సచివాలయాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. మరీముఖ్యంగా ఈబీసీ నేస్తం పథకానికి అర్హులైన ప్రతిఒక్కరి చేత రేపటిలోగా దరఖాస్తు చేయించాలని …
Read More »ప్రణాళికాబద్ధంగా గృహ నిర్మాణాల పురోగతి సాధించాలి…
-మండలవారి లక్ష్యాలు నిర్దేశించిన జెసి డవలప్మెంట్ ఎల్. శివశంకర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ డవలప్మెంట్ ఎల్. శివశంకర్ కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాలులో సోమవారం బందరు డివిజనుకు సంబంధించి ఎంపిడివోలు, తహసిల్దార్లు, హౌసింగ్ డిఇ, ఎఇలు, ఉపాధిహామి ఎపివోలతో సమావేశం నిర్వహించి బందరు డివిజనులో గృహనిర్మాణ పురోగతిపై మండల వారి సమీక్షించారు. ఆయా మండలాల్లో గల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఒకొక్కరు రోజుకు కనీసం 5 గృహలు బెన్మెంట్ స్థాయికి నిర్మించుకునేలా చూడాలని, ఈ విధంగా ప్రతి మండలానికి వచ్చేవారానికి …
Read More »దివ్యాంగుడి అర్జీను సహృదయంతో పరిష్కరించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్ నవీకరణ కష్టాలు సాంకేతిక సమస్యలు ఓ దివ్యాంగుడి పింఛన్ పై తీవ్ర ప్రభావం చూపింది. వేలిముద్రలు సరిగా పడలేదన్న కారణంగా నిలిచిపోయిన పింఛన్ ను జిల్లా కలెక్టర్ జె నివాస్ పెద్ద మనస్సుతో చొరవ చూపి పునరుద్ధరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో నిరుపేద తల్లితండ్రులు తమ పుత్రుడికి కల్గిన కష్టాన్ని జిల్లా కలెక్టర్ వద్ద విన్నవించుకొన్నారు. వాసే వాసు (12) పుట్టుకనుంచి దివ్యాంగుడని, గతం నుంచి మంజూరై వస్తున్న పింఛన్ ను …
Read More »నున్న లే అవుట్ హౌసింగ్ నిర్మాణ పనుల పోరోగతిని పరిశీలన…
-హౌసింగ్ నిర్మాణ పనులు వేగవంతము చేయాలనీ అధికారులు మరియు కాంట్రాక్టులకు ఆదేశాలు -నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు ఇల్లు కార్యక్రమమునకు సంబందించి నున్న లే అవుట్ నందు చేపట్టిన హౌసింగ్ నిర్మాణ పనుల యొక్క పురోగతిని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ఈ సందర్బంలో ఈ ప్రాంతములో 954 ఇళ్ళకు గాను 335 ఇల్లు బేస్ మేట్ వరకు వచ్చినవని …
Read More »ప్రజలకు హాని కల్గించేలా కల్తి లేదా కుళ్ళిన మాంసం విక్రయాలు సాగిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు హాని కల్గించేలా కల్తి లేదా కుళ్ళిన మాంసం విక్రయాలు సాగించిన యెడల అట్టి వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. సింగ్ నగర్ ప్రాంతములో కల్తి మాంసపు విక్రయాలు జరుగుచున్నవని ప్రజల నుండి వచ్చిన సమాచారo మేరకు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజారోగ్య అధికారులు సిబ్బందితో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగర పాలక సంస్థ వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డా.ఏ.రవిచంద్ అద్వర్యంలో …
Read More »ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంగా టీకా ఎక్సప్రెస్ వాహనాలు…
-నగరంలో రెండు టీకా వాహనాల ద్వారా వ్యాక్సినేషన్… : కమీషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో ది.05.10.2021 నుండి 12.10.2021 వరకు వారం రోజుల పాటు టీకా ఎక్సప్రెస్ వాహనాలు ద్వారా నేరుగా వ్యాక్సిన్ వేసుకోనని వారి ప్రాంతాలకి వెళ్ళి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవటం జరిగిందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ,ఏ,ఎస్ వివరించారు. ముఖ్యంగా వాంబె కాలనీ, లంబాడి పేట, న్యూ ఆర్. ఆర్. పేట, కొత్త పేట, క్రీస్తు రాజ్ పురం, భీమన …
Read More »